Sarpanch: సర్పంచ్‌గా గెలిచిన చనిపోయిన వ్యక్తి.. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చిత్ర విచిత్రం.. తల పట్టుకున్న అధికారులు..

ఎంతో ఉత్సాహంగా, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. గుండెపోటుకు గురై మరణించారు.

Sarpanch: సర్పంచ్‌గా గెలిచిన చనిపోయిన వ్యక్తి.. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చిత్ర విచిత్రం.. తల పట్టుకున్న అధికారులు..

Updated On : December 11, 2025 / 9:52 PM IST

Sarpanch: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో చిత్ర విచిత్రం చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ సర్పంచ్ గా ఇటీవల మరణించిన మురళి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 378 ఓట్ల ఆధిక్యం సాధించారు. నామినేషన్ వేసిన తర్వాత మురళి చనిపోయారు. దాంతో గ్రామస్తులు ఆయనకే ఓటు వేశారు. చనిపోయిన వ్యక్తి సర్పంచ్ గా గెలవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఏం చేద్దాం అన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మురళి.. ప్రచారం చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించారు.

చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చెర్ల మురళి (53) సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మురళికి సీరియల్ నెంబర్ 2 కత్తెర గుర్తు వచ్చింది. ఎంతో ఉత్సాహంగా, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. గుండెపోటుకు గురై మరణించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి సర్పంచ్ గా గెలిచి ఊరికి సేవలు అందిస్తారని భావిస్తే అకాల మరణంతో ఆశలు ఆవిరి చేశారని గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్‌ సిటీ ఎందుకైంది? నెగటివిటీ, యాంటీ సెంటిమెంట్ రాకుండా ఇలా..