ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్‌ సిటీ ఎందుకైంది? నెగటివిటీ, యాంటీ సెంటిమెంట్ రాకుండా ఇలా..

చైనీస్, జపనీస్, కొరియన్, వియత్నాం భాషల్లో నాలుగు అనే సంఖ్య పలికే విధానం డెత్ అనే పదాన్ని పోలి ఉంటుందట.

ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్‌ సిటీ ఎందుకైంది? నెగటివిటీ, యాంటీ సెంటిమెంట్ రాకుండా ఇలా..

future city hyderabad

Updated On : December 11, 2025 / 9:38 PM IST

Future City: హైదరాబాద్.. వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మెట్రోపాలిటిన్ సిటీ. అయితే రోజురోజుకు పెరుగుతున్న జనాభా..అంతకంతకు పెరగాల్సిన సదుపాయాలు..ఇలా ఎన్నో అవసరాలు మరెన్నో వసతులు..భాగ్యనగరానికి సవాల్గా మారాయి. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్ కిక్కిరిసిపోగా..ఐటీ హబ్‌గా ఉన్న సైబరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ ఐటీ సంస్థల ఆఫీసులు..పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏర్పడ్డాయి. ఎయిర్ పోర్ట్కు ఆనుకొని ఉండటం..జనాభా పెరిగిపోవడంతో ట్రాఫిక్ జామ్‌తో సైబరాబాద్ కూడా రద్దీగా మారింది.

దీంతో ఇప్పుడు సిటీపై ఒత్తిడి తగ్గించేందుకు..నగరాన్ని ఆనుకొని ప్రత్యామ్నాయంగా ఫోర్త్ సిటీని డెవలప్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు అత్యంత దగ్గరలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది పూర్తిగా పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉండాలనేది రేవంత్‌రెడ్డి డ్రీమ్. అయితే ప్రతిపాదిత ఫోర్త్ సిటీ విషయంలో అంతా బానే ఉన్నా..ఆల్ ఆఫ్ సడెన్‌గా ఆ పేరు మాయమవడం చర్చకు దారితీస్తోంది. ఫోర్త్ సిటీ ప్లేస్‌లో భారత్ ఫ్యూచర్ సిటీ అంటూ కొత్త పేరును తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం లేటెస్ట్గా గ్రాండ్ స్కేల్లో ఆర్గనైజ్ చేసిన గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్లో కూడా భారత్ ప్యూచర్ సిటీ అంటూ ప్రస్తావించారు. (Future City)

Sonali Rishabh Love Story: నల్లగా ఉంటే అసలు పెళ్లే చేసుకోకూడదా ఏంటి? అసలు రంగు, రూపంపై ఈ వివక్ష ఏంటి?

అయితే ఫోర్త్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీగా పేరు మారడానికి బలమైన రీజన్స్ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఫోర్త్ సిటీ అంటే సెంటిమెంట్అంతగా కలిసిరాదని భావించారట. కొన్ని దేశాల్లో ముఖ్యంగా ఆసియా ఖండంలో నాలుగు సంఖ్యను అపశకునంగా భావిస్తారు. చైనీస్, జపనీస్, కొరియన్, వియత్నాం భాషల్లో నాలుగు అనే సంఖ్య పలికే విధానం డెత్ అనే పదాన్ని పోలి ఉంటుందట. అందుకే నాలుగు అనే సంఖ్యకు ఆయా దేశాల వారు సెంటిమెంట్ పరంగా దూరంగా ఉంటారట. అందుకే మల్టిబుల్ ఫ్లోర్స్ తో కట్టే బిల్డింగులు, హాస్పిటళ్లల్లో ఫోర్త్ ఫ్లోర్ అనే పదానికి ఆల్టర్నేట్ గా ఇతర వర్డ్ ను వాడుతుంటారు.

ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న కొత్తనగరానికి ఫోర్త్ సిటీ కాకుండా ఫ్యూచర్ సిటీ అని పెడితే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డికి కొందరు సన్నిహితులు చెప్పారట. దీంతో సీఎం రేవంత్ ఫోర్త్ సిటీ పేరు ప్లేస్‌లో ఫ్యూచర్ సిటీ అని బలంగా తీసుకెళ్తున్నారని అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ సందర్భంగా విడుదల చేసిన డాక్యుమెంట్లో కూడా ఫ్యూచర్ సిటీ అని ప్రస్తావించారు.

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత వస్తోన్న నగరం కాబట్టి ఫోర్త్ సిటీ అని అధికారులు ముందుగా భావించారు. అయితే ఆ పేరు సంఖ్యాపరంగా నెగెటివిటీని క్రియేట్ చేస్తుందని, యాంటీ సెంటిమెంట్ అని సీఎం చెవిన పడిందట. అందుకే రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ అని కాకుండా ఫ్యూచర్ సిటీగా ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్.. చైనా, జపాన్ వంటి దేశాలతో ఎక్కువగా బిజినెస్ చేస్తుంది. ఫోర్త్ సిటీ అని పిలిస్తే విదేశీ ఇన్వెస్టర్లు ఆ నెగెటివ్ డిజిట్‌ను సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారేమోనన్న డౌట్‌తో.. ఫ్యూచర్ సిటీగా మార్చారేమోనన్న ఒపీనియన్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే హైదరాబాద్ కొత్త నగరం విషయంలో సెంటిమెంట్ కారణంగా ఫోర్త్ కాస్త ఫ్యూచర్ సిటీగా మారింది. దాదాపు 30వేల ఎకరాల్లో విస్తరించబోతున్న ఈ ప్యూచర్ సిటీపై ప్రభుత్వం పెట్టుకున్న అంచనాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి మరి.