Sonali Rishabh Love Story: నల్లగా ఉంటే అసలు పెళ్లే చేసుకోకూడదా ఏంటి? అసలు రంగు, రూపంపై ఈ వివక్ష ఏంటి?

సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం..లేదంటే ఈ సైకోగాళ్లకి తక్షణశిక్షలు పడేలాగా చట్టాలు మార్చడమే.

Sonali Rishabh Love Story: నల్లగా ఉంటే అసలు పెళ్లే చేసుకోకూడదా ఏంటి? అసలు రంగు, రూపంపై ఈ వివక్ష ఏంటి?

Updated On : December 11, 2025 / 8:57 PM IST

Sonali Rishabh Love Story:  మన చుట్టూనే ఉంటారు..అంతా మామూలుగానే కనిపిస్తారు. కానీ వాళ్లు చేసే పైత్యపు పనులు.. సైకో చేష్టలన్నీ సోషల్ మీడియాలో అసహ్యం కలిగిస్తుంటాయ్. రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌లో పెళ్లి చేసుకున్న ఓ జంటపై ఈ సోషల్ మీడియా సైకో గ్యాంగ్ ప్రదర్శించిన దాష్టీకం అంతా ఇంతా కాదు.

అసలు వీళ్ల ఆగడాలు ఏ స్థాయికి చేరాయంటే..ప్రతి ఒక్కరి జీవితంపైనా వీళ్లకేదో హక్కున్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు. వీరి శాడిజానికి రిషన్ రాజ్ సింగ్, సోనాలి చోక్సే‌ని ట్రోలింగ్ చేసిన ఉదంతమే ఓ పెద్ద ఉదాహరణ..ఇంతకీ వీళ్లనేం చేయాలి?

మధ్యప్రదేశ్‌కి చెందిన రిషబ్ రాజ్ పుత్..సోనాలి చోక్సే 11 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జంట కావడంతో..ప్రతోడో కామెంట్లు విసిరారు. అసలు నీలాంటి నల్లటోడికి ఈ అమ్మాయేంటని..అంతా గవర్నమెంట్ జాబ్ మహిమ అని..డబ్బు కోసమే చేసుకుని ఉంటుందని..ఇలా ఎవడికి వాడు నోటితోనే విరేచనాలు చేసుకున్నారు. ఇలాంటోళ్లంతా నాగరికులుగా చలామణీ కావడమే సమాజం దురదృష్టం.

Donald Turmp: కాళ్ల బేరానికి వచ్చిన డొనాల్డ్ ట్రంప్..? రష్యాకి అదిరిపోయే ఆఫర్లు..!

ఇలాంటి వెధవాయిలు..వెధవమ్మల కోసమే బహుశా ప్రతి దేశం..సోషల్ మీడియాపై ఆంక్షలు కానీ..కొన్ని రకాలు హద్దులు కానీ పెట్టాలని చూస్తున్నారు. అప్పటికీ రిషబ్ రాజ్..తమపై వస్తోన్న ట్రోల్స్‌ని లైట్ తీసుకున్నాడు..హుందాగా స్పందించాడు.. ఒరే సన్నాసుల్లారా నాకేం గవర్నమెంట్ ఉద్యోగం లేదు.. అలానే పెద్దగా డబ్బూ లేదు..ఐతే ఒకటి నిజం నేను నల్లగానే ఉన్నా.. ఐనంత మాత్రాన నా భార్యని బాగా చూసుకోకుండా ఉండను..అని స్పందించాడు..

ఐనా వాటిని కూడా ఎగతాళి చేస్తున్నారంటే..ఇలాంటి జనం ధైర్యమంతా సోషల్ మీడియాలోనే అని అర్ధమవుతోంది..అక్కడైతే ఎవడూ ఎవడికి కన్పించడు కనీసం ఫోన్ నంబర్ కూడా ఉండదు..నాలుగు మాటలు పడేసి పైశాచికఆనందం పొందవచ్చనేది ఈ సైకోదద్దమ్మల ఆలోచన

అసలు అందం అంటే ఏంటనేది ఇప్పటిదాకా ఎవడైనా సరిగ్గా నిర్వచించారా..లేక లేచిన దగ్గర్నుంచి పనీ పాటా లేనట్లు
మొబైల్ స్వాప్ చేస్తూ..రోజులు గడిపే వెధవలనుంచి అలాంటిది ఆశించడం కూడా తప్పేనా..వీటన్నిటికి బెస్ట్ రెమెడీ.. సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం..లేదంటే ఈ సైకోగాళ్లకి తక్షణశిక్షలు పడేలాగా చట్టాలు మార్చడమే.

భావప్రకటనా స్వేచ్చ అంటే ఏదైనా విషయంపై నీ అభిప్రాయం చెప్పుకోవడం అంతేకానీ పక్కనోడి పెళ్లిపైనా..వాడి జీనితంపైనా పడి ఏడవడమో..ఎగతాళి చేయడమో కాదు కదా! ఇది అర్ధం కావాలంటే ఈ సోషల్ సైకోగాళ్లకి కూడా ఇలాంటి ట్రీట్‌మెంటే ఎదురైనప్పుడే అర్థమవుద్దనుకోవాలి.