Rose Flowers Cultivation : గులాబీ పూల సాగుతో ప్రతినెల 70వేల నికర అదాయం పొందుతున్న రైతు

వాతావరణం పూల సాగుకు అనుకూలంగా ఉండటంతో పృథ్వీ చేసిన ప్రయోగం ఫలించింది. మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమైంది. మూడు సీజన్‌లకు కలిపి ప్రతి నెల సుమారుగా 400 కేజీల పూల వరకు విక్రయిస్తున్నాడు. నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం పొందుతున్నాడు.

Rose Flowers Cultivation

Rose Flowers Cultivation : మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనుభవం..అయినా ఏదో తెలియని కొరత…మరేదో చేయాలన్న తపన…ప్రతినెల చేతికి వేలరూపాయలు జీతం రూపంలో వస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి. ఈ క్రమంలోనే అతను పొలం బాట పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగంలో లభించని సంతోషాన్ని వ్యవసాయంలో వెతుక్కుంటూ పల్లెటూరి బాటపట్టాడు.

READ ALSO : Buddha Venkanna : లోకేశ్ పాదయాత్ర అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల గురించి తెలుసుకున్నాడు. స్థానిక వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించాడు. ఏడాది పొడవునా ఆదాయం వచ్చే పంటలను సాగు చేయటం ద్వారా మంచి అదాయం పొందవచ్చని గుర్తించాడు. అనుకున్నదే తడువుగా గులాబీల సాగుకు శ్రీకారం చుట్టాడు ఏలూరు జిల్లాకు చెందిన యువరైతు పృథ్వీ. ప్రస్తుతం పృథ్వీ ఆప్రాంత రైతులకు అదర్శంగా నిలుస్తున్నాడు.

READ ALSO :Prawn Feeding : వ్యాధినిరోధక శక్తి పెరిగి.. పెట్టుబడులు తగ్గించే రొయ్యల దాణా

ఏలూరు జిల్లాలోని కళ్లచెరువుకు చెందిన పృథ్వీ బీటెక్ విద్య పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే అది ఏమాత్రం నచ్చకపోవటంతో తన తండ్రులు అనుసరించిన వ్యవసాయన్ని కొనసాగించాలని నిర్ణయించుకుని సొంత ఊరు వచ్చేశాడు. వాణిజ్య పంటలలో గులాబీ సాగు మంచి లాభాలను అందిస్తుందని తెలుసుకున్నాడు. ఆపంట సాగులో మెళుకువులను తెలుసుకున్నాడు. 15 ఎకరాల్లో గులాబీ పూల సాగు ప్రారంభించాడు. బెంగుళూరు రకం, సెంటు రకాల సాగు చేపట్టాడు.

READ ALSO : రూపే క్రెడిట్ కార్డుతో గూగుల్ పే యూపీఐ పేమెంట్..!

ఆ ప్రాంత వాతావరణం పూల సాగుకు అనుకూలంగా ఉండటంతో పృథ్వీ చేసిన ప్రయోగం ఫలించింది. మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమైంది. మూడు సీజన్‌లకు కలిపి ప్రతి నెల సుమారుగా 400 కేజీల పూల వరకు విక్రయిస్తున్నాడు. నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం పొందుతున్నాడు. ఒకసారి మొక్కలు నాటితే 6 నుంచి 8 ఏళ్ల వరకు పూల ఉత్పత్తి వస్తుంది. ప్రతి నెల నికర ఆదాయం లభిస్తుండటంతో తోటి రైతులు సైతం గులాబీ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో మేలు రకాల పూలను సాగు చేస్తూ మంచి అదాయం పొందుతున్నానని పృథ్వీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు