Intercropping : డ్రాగన్ ఫ్రూట్ లో అంతర పంటగా వక్కసాగు

ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగుచేయడం. కాలం కలిసి వస్తే రెండు పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ.. డ్రాగన్ ఫ్రూట్ లో అంతరపంటగా వక్కను సాగు చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన  రైతు నవీన్ కుమార్

Intercropping

Intercropping : వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్ధితులు ఎలా ముంచుకొస్తాయో ఉహించలేం.. ఏ తెగులు ఎప్పుడు, ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం.. ఎంతనష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం.. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగుచేయడం. కాలం కలిసి వస్తే రెండు పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ.. డ్రాగన్ ఫ్రూట్ లో అంతరపంటగా వక్కను సాగు చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన  రైతు నవీన్ కుమార్

READ ALSO : Dragon Fruit : ఒక్కసారి నాటితే.. 25 ఏళ్లు దిగుబడి ఇస్తుంది

ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు నవీన్ కుమార్ అర ఎకరంలో గత ఏడాది డిసెంబర్ నెలలో ఆధునిక పద్ధతుల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుచేశారు. అంతర పంటగా వక్క మొక్కలను నాటారు. డ్రాగన్ ఫ్రూట్ నుండి మరో మూడు నాలుగు నెలల్లో దిగుబడి ప్రారంభం కానుంది. వక్కనుండి మూడేళ్ల తరువాత దిగుబడిని పొందనున్నారు. ఈ ప్రాంతంలో కోతుల బెడద అధికంగా ఉండటం వలన తోట చుట్టు సోలార్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు.

READ ALSO : Jasmine : మల్లెసాగులో సస్యరక్షణ, యాజమాన్యం

ప్రధాన పంట మధ్య వున్న స్థలం వృధా కాకుండా ఖాళీ స్థలంలో పండించే పంటనే అంతర పంట అంటారు. ఈ అంతర పంట వల్ల చాలా  ప్రయోజనాలున్నాయి. అంతర పంట వేయడం వలన ఒక పంట దెబ్బతిన్నా మరో పంట ఎంతో కొంత దిగుబడి నిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది. ఈ విధానం వల్ల అదనపు అదాయంతోపాటు, పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీటకాలు ,తెగుళ్ళు,కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి.