Crop Protection In Cotton : పత్తిలో సమగ్రసస్యరక్షణలో భాగంగా అంతర పంటలవైపు మొగ్గు!

ఆఖరు దుక్కిలో భాస్వరం ఎరువును వేసుకుంటే విత్తిన 25 నుండి 30 రోజుల లోపు సిఫారుసు చేసిన మోతాదులో భాస్వరం ఎరువును వేసుకోవాలి. విత్తనం మొలకెత్తిన వారం పదిరోజుల వరకు మకిలి పురుగు వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అది గట్ల వెంట ఎక్కువగా కనిపిస్తుంది.

Crop Protection In Cotton : పత్తిలో సమగ్రసస్యరక్షణలో భాగంగా అంతర పంటలవైపు మొగ్గు!

As part of comprehensive crop protection in cotton, turn to intercropping!

Updated On : November 17, 2022 / 6:35 PM IST

Crop Protection In Cotton : పత్తి సాగు చేసే రైతులు సమగ్ర సస్యరక్షణలో భాగంగా అంతర పంటలవైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. జులైలో విత్తుకునే పత్తిలో పెసర, లేదా మినుము లేదంటే కంది పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. బీటీ పత్తికి ఎకరాకు 48 నుండి 60 కిలోల నత్రజని, 24కిలోల పొటాష్ పోషకాలను అందించాలి. ఇతర పంటలతో పోలిస్తే పత్తి పంట చీడపీడలను తట్టుకునే అవకాశం అధికంగా ఉంటుంది. దీంతో పాటు దిగుబడి అధికంగా వస్తున్నది. మిగితా పంటలతో పోలిస్తే గిట్టుబాటు ధర కూడా ఎక్కువ. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది.

ఆఖరు దుక్కిలో భాస్వరం ఎరువును వేసుకుంటే విత్తిన 25 నుండి 30 రోజుల లోపు సిఫారుసు చేసిన మోతాదులో భాస్వరం ఎరువును వేసుకోవాలి. విత్తనం మొలకెత్తిన వారం పదిరోజుల వరకు మకిలి పురుగు వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అది గట్ల వెంట ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. తొలిరోజుల్లో పంటను ఆశించే రసం పీల్చు పురుగుల నివారణకు మోనో క్రోటోఫాస్ 1;4 నిష్పత్తిలో విత్తిన 45 రోజులకు కాండం మీద మందుపూత పూసే పద్దతి పాటించాలి.

పత్తిపంట 30 రోజుల్లో ఉన్నప్పుడు అధికంగా తెగుళ్లు, పలు రకాలుగా పంటను ఆశించి నాశనం చేస్తాయి. 40-45 రోజుల మధ్య రసం పీల్చే పురుగులు వ్యాపిస్తాయి. 45-60 రోజుల మధ్య పూత, కాయ, తొలుచు పురుగులు ఆశిస్తాయి. వీటి నివారణకు పైరు వయస్సు ఇరవై రోజులున్నప్పుడు 100 మిల్లీలీటర్ల మిథైల్ డిమిటాన్ మందును 400మి.లీ నీటిలో కలిపి పిచికారి చేయాలి. అదే మందును నలభై రోజుల పైరు ఉన్నప్పుడు 500 మి.లీ. నీటిలో 125 మి.లీ మందును కలిపి పిచికారి చేయాలి. 60 రోజులు ఉన్నప్పుడు 150 మి.లీ మందులో 600 మి.లీ నీటితో పిచికారి చేయాలి. లేదా మోనోక్రోటోఫాస్, మిథైల్ డిమోటాన్ ఇమిడాక్రో ప్రిడ్‌లు ఒక పాటు మందు, ఇరవై పాళ్లు నీటితో కలిపి పిచికారి చేయాలి.