Azolla Cultivation Methods : అజోల్లా పెంపకం.. సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు 

Azolla Cultivation Methods : కారుచీకటిలో కాంతిపుంజంలా వెలుగులోకొచ్చింది అజొల్లా. ఇప్పటికే దీని వాడకం విరివిగా వున్నా.. రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు. అజొల్లా పెంపకం, ఉపయోగాల గురించి సమగ్ర వివరాలను తెలియజేస్తున్నారు,

Azolla Cultivation Methods

Azolla Cultivation Methods : వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, జీవాల పెంపకం, కోళ్లు తదితర రంగాల్లో దాదాపు 60 శాతం ఖర్చు మేతకే అవుతుంది. పచ్చిమేత కొరత, పెరిగిన దాణా ధరల వల్ల రైతు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాడు. ఈ నేపధ్యంలో పశుపోషకులకు వరంగా మారింది అజొల్లా. ఇంటి వద్దే చిన్నచిన్న తొట్లల్లో పశువులు, జీవాల అవసరాలకు అనుగుణంగా అజొల్లాను, సులభంగా పెంచుకోవచ్చు.

Read Also : Red Gram Cultivation : కందిపంటలో శనగపచ్చ పురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

నిత్యం దిగుబడి తీసుకోవచ్చు. పైగా దీన్ని పోషకాల గనిగా చెబుతారు. దీన్ని పశువుల మేపులో భాగం చేసుకుంటే రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహారావు, వెటర్నరీ కాలేజి  అసిస్టెంట్ ప్రొఫెసర్  డా బి. విద్య . వ్యవసాయ అనుబంధ రంగాలు వాణిజ్యరూపును  సంతరించుకుంటున్నాయి. కొత్తగా ఈ రంగంలోకి  అడుగు పెట్టే వారికి చక్కటి ఉపాధి మార్గంగాలుగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతం పశుల మేత ఖర్చు, గణనీయంగా  పెరిగిన నేపధ్యంలో దీన్ని అదుపులో వుంచాల్సిన మార్గాలపై  ప్రతి రైతు దృష్టి సారించాల్సిన  అవసరం వుంది.  పచ్చిమేత  ఎంత సమృద్ధిగా అందించగలిగితే, పశుపోషణ అంత లాభాల బాటలో వుంటుంది. కానీ పశుగ్రాస క్షేత్రాలు తగ్గిపోయాయి, దాణాలపై అధికంగా ఆధారపడటం వల్ల, పోషణ భారమై ఈ రంగాలకు దూరమవుతున్న వారు అనేకం.

దాణాకు ప్రత్యామ్నాయంగా అజొల్లా : 
ఇలాంటి పరిస్థితుల్లో కారుచీకటిలో కాంతిపుంజంలా వెలుగులోకొచ్చింది  అజొల్లా. ఇప్పటికే దీని వాడకం విరివిగా వున్నా… ఇంకా చాలా మంది రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు. అజొల్లా పెంపకం, ఉపయోగాల గురించి సమగ్ర వివరాలను తెలియజేస్తున్నారు, రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహారావు, వెటర్నరీ కాలేజి  అసిస్టెంట్ ప్రొఫెసర్  డా బి. విద్య.

అజొల్లాను పోషకాల గని గా చెప్పవచ్చు. దీనిలో 25-35శాతం ప్రొటీన్లు వుంటాయి. ఇప్పటివరకు మేలైన గడ్డిజాతులుగా భావిస్తున్న బర్సీం, లూసర్న్, అలసంద మొక్కలకంటే మంచి పోషణనిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. పశువుకు ఇచ్చే దాణాతో పోలిస్తే 2 కిలోల అజొల్లా, కిలో దాణాతో సమానమని తేలింది. మరి కిలో దాణాకయ్యే ఖర్చు  20రూపాయలు.

అదే అజొల్లాను 2కిలోలు ఉత్పత్తిచేయాలంటే కేవలం 2రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. పైగా అజొల్లాను పశువులకు మేపటం వల్ల 15-20 శాతం పాల దిగుబడి పెరిగుతుంది. పాలలో వెన్నశాతం కూడా పెరుగుతున్నట్లు  రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి.

Read Also : Tobacco Leaves Cultivation : లాభదాయకంగా మారిన పొగాకు సాగు

ట్రెండింగ్ వార్తలు