Tobacco Leaves Cultivation : లాభదాయకంగా మారిన పొగాకు సాగు

Tobacco Leaves Cultivation : వాణిజ్య పంటల్లో అత్యంత ఖరీదైన పంట పొగాకు. ఈ పంట సాగులో ఖర్చు శ్రమ అధికంగానే ఉన్నా, అందుకు తగ్గ ప్రతి ఫలం లభిస్తుండటంతో, రైతులు ఈ పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు.

Tobacco Leaves Cultivation : లాభదాయకంగా మారిన పొగాకు సాగు

Tobacco Leaves Cultivation

Updated On : January 6, 2024 / 3:07 PM IST

Tobacco Leaves Cultivation : పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి. కడుపునిండా తిండిపెట్టాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు సాగుతో దొరుకుతున్నదని అంటున్నారు నిజామాబాద్ జిల్లా, రెంజల్‌ మండలంలోని రైతులు. తక్కువ సమయం.. తక్కువ నీటితోనే పంట చేతికి వస్తుండటంతో పొగాకు సాగుచేస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు రైతులు.

Read Also : Chilli Crop Cultivation : మిరప తోటల్లో వైరస్ తెగులు ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం

వాణిజ్య పంటల్లో అత్యంత ఖరీదైన పంట పొగాకు. ఈ పంట సాగులో ఖర్చు శ్రమ అధికంగానే ఉన్నా, అందుకు తగ్గ  ప్రతి ఫలం లభిస్తుండటంతో, రైతులు ఈ పంట సాగుకు  మొగ్గుచూపుతున్నారు. నిజామాబాద్ జిల్లా, బోధన్ డివిజన్ లోని పలు గ్రామాలలో వేలాది ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేస్తున్నారు రైతులు.

9 వేల ఎకరాల్లో పొగాకు సాగుచేస్తున్న రైతులు : 
క్వింటాలుకు 10 వేలకు పైగా మద్ధతు ధర పలకటంతో రైతులు ఇష్టంగా సాగు చేస్తున్నారు. ఈ పంటకు పెద్దగా చీడపీడలు ఆశించవు.. నీటితడులు కూడా పెద్దగా అవసరం ఉండదు. అంతేకాదు పంట కొనుగోలుకు ముందుగానే పలు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకోవటంతో దాదాపు ఒక్క రెంజల్ మండలంలోనే  9 వేల ఎకరాలకు పైగా పొగాకు సాగు చేస్తున్నారు.

చలికాలంలో ఈపంట ఆకు ఎక్కువగా పెరుగుతుంది. ఆకు ఎంత పెరిగితే అంత దిగుబడి రైతుకు వస్తుంది. ఒక్కో రైతు  సుమారుగా 20 ఎకరాల వరకు పొగాకును సాగు చేస్తున్నారు. ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది.  పెట్టుబడి రూ. 40 నుండి 50 వేలు అవుతుంది. మూడు నెలల్లోనే మంచి ఆదాయం వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Corn Crop : మొక్కజొన్నలో కత్తెర పురుగును అరికట్టండి ఇలా..