Bengal Gram Cultivation Methods
Bengal Gram Cultivation : తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట దిగుబడులు వస్తుండటంతో రబీలో చాలా మంది రైతులు శనగసాగును చేపట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే శీతాకాలంలో మంచును ఉపయోగించుకొని పెరిగే ఈ పంటలో అధిక దిగుబడులు పొందాలంటే , ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందని రైతులకు చెబుతున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యాకిషోర్.
శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం వుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో సుమారు 15 లక్షల ఎకరాల్లో శనగ సాగవుతుండగా.. తెలంగాణలో 1 లక్షా 50 వేల హెక్టార్లలో సాగవుతుంది. తేమ బాగా పట్టిఉంచే సారంవంతమైన మధ్యస్థ , నల్లరేగడి నేలలు అనుకూలం.
చౌడు నేలలు, మురుగునీరు నిలిలచే నేలలు పనికిరావు. తొలకరి పైర్లు కోసిన తర్వాత భూమిని మెత్తగా దున్ని విత్తనాలను విత్తుకోవాలి. ఈ పంటలో మంచి యజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. శనగ సాగుకు అనువైన రకాలు, యాజమాన్యంలో పాటించాల్సిన మెళకువలు గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యాకిషోర్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : Organic Paddy Cultivation : జీరోబడ్జెట్ విధానంలో 15 ఎకరాల్లో వరిసాగు