Farming Tips : పందిరి విధానంలో సొర సాగు – అధిక ఆదాయం ఆర్జిస్తున్న తూర్పుగోదావరి రైతు  

Bottle Gourd Farming : పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, చాలా మంది రైతులు నష్టపోతూ ఉంటారు. అయినా మళ్లీ అదే పంటను సాగుచేస్తూ ఉంటారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటను గుర్తించరు.

bottle gourd farming

Farming Tips : రైతులు ఏ పంట పండించినా, దానిని మార్కెట్ చేసుకునే విధానాన్ని బట్టే ఆదాయం వస్తుంది. ఒక సారి అధిక ధరలు పలికిన పంటలకు మరోసారి గిట్టుబాటు ధరలు కూడా పోతున్నాయి. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా మారాలి. ఇదే విషయాన్ని గమనించిన, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరాల్లో  పందిరి విధానంలో సొరసాగు చేపట్టి మంచి ఫలితాలను పొందుతున్నాడు.

పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, చాలా మంది రైతులు నష్టపోతూ ఉంటారు. అయినా మళ్లీ అదే పంటను సాగుచేస్తూ ఉంటారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటను గుర్తించరు. తోటి రైతులు సాగుచేసే పంటలనే సాగుచేస్తూ ఉంటారు. అందుకే నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కానీ తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, ఖండవల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణంరాజు ఎకరంలో పందిర్లపై తీగజాతి కూరగాయలు సాగుచేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

ప్రస్తుతం రెండు రకాల సొర ను పండిస్తున్నారు. నాటిన 45 రోజుల నుండే దిగుబడి ప్రారంభం అవుతుంది. వచ్చిన కాయలను స్థానికంగానే అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు. అంతే సొర పంట అయిపోగానే మరో తీగజాతి కూరగాయ పంటను వేస్తూ.. ఏడాదంతా కూరగాయలే పండిస్తున్నారు.

పందిరి తోటల పెంపకం ఇతర పంటల కంటే లాభదాయకం అనడంలో సందేహం లేదు. వీటిపై పండిన కూరగాయలు నాణ్యతతో పాటు అధిక దిగుబడి సాధించేందుకు వీలుంటుంది. అధిక ధర వస్తుంది కాబట్టి రైతులకు మంచి ఆదాయం వస్తుంది.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..