Buffalo Reproduction : వాణిజ్య స్థాయిలో విస్తరించిన పాడి పరిశ్రమ.. పునరుత్పత్తిలో పాటించాల్సిన యాజమాన్యం 

Buffalo Reproduction : ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు. దీర్ఘకాలిక వ్యాధుల వలన కూడా పశువులు సకాలంలో ఎదకు రావు.

Buffalo Reproduction

Buffalo Reproduction : వ్యవసాయ అనుబంధ రంగంగా పాడి పరిశ్రమ వాణిజ్య స్థాయిలో విస్తరించింది. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ.. ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కొందమంది నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తోంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం. లక్షలుపోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసిమోపెడవుతోంది.

దీని వల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి , పాడికాలం తగ్గి రైతుకు ఆర్ధికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యల నుండి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలంటున్నారు వెంకటరామన్న గూడెం గేదెల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అల్లుతేజ.

నేడు పశుపోషణ పాతకాలం నాటి పెరటి వృత్తి కాదు. ప్రస్తుతం ఇది ఒక వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా రుపుదిద్దుకోన్నది. పశుపోషణ భారత దేశపు వ్యవసాయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తున్నది. చక్కటి  ప్రణాళికతో పెంపకం చేపడితే మంచి లాభాలను పొందవచ్చు. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు.

ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు. దీర్ఘకాలిక వ్యాధుల వలన కూడా పశువులు సకాలంలో ఎదకు రావు. పశువులకు అందించే మేతలో తగినన్ని ఖనిజలవణాలు లేకపోవటం , విటమిన్ ఎ లోపం వల్ల కూడా ఎద లక్షణాలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యల నుండి గట్టెక్కాలంటే గేదెల్లో మేలైన పునరుత్పత్తి యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, వెంకటరామన్న గూడెం గేదెల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అల్లు తేజ.

అపరిశుభ్రమైన పరిసరాలలలో పశువులు ఈనినప్పుడు , తగు జాగ్రత్తలు పాటించకపోవటం , మాయ సకాలంలో పడకపోవడం వల్ల గర్భాశయ వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వ్యాధుల వల్ల చూడి నిలవదు. నిలబడినా కొద్ది రోజుల్లోనే గర్భస్రావం జరుగుతుంది. గర్భాశయ వ్యాధులలలో పాడిపశువు మానం నుండి చీము కారటం. ఇలాంటి వాటిని గుర్తించిన వెంటనే పశువైద్యులను సంప్రదించాలి.

Read Also : Zero Budget Farming : జీరోబడ్జెట్ విధానంలో దేశీ వరి సాగు – తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు అంటున్న రైతు