Kakara Sagu : శాశ్వత పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు రూ. 80 వేల నికర ఆదాయం

శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకొని, తీగజాతి కూరగాయలైన కాకరను సాగు చేస్తున్నారు. ఒక పంట తరువాత మరో పంటను వేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు.. ప్రతిరోజు ఆదాయం గడిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Kakara Sagu : సంప్రదాయ పంటల స్థానంలో, కూరగాయలను పండిస్తూ.. వినూత్న పద్ధతుల్లో ముందుకు సాగుతున్నారు రైతులు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు, రెండున్నర ఎకరాల్లో,శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకొని, తీగజాతి కూరగాయలైన కాకరను సాగు చేస్తున్నారు. ఒక పంట తరువాత మరో పంటను వేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు.. ప్రతిరోజు ఆదాయం గడిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

READ ALSO : Bitter Gourd Cultivation : పందిరి కాకర సాగుతో.. అధిక లాభాలు పొందుతున్ననెల్లూరు జిల్లా రైతు

కరీంనగర్ జిల్లా, కరీంనగర్ రూరల్ మండలం, గోపాలపూర్ గ్రామంలో అధిక విస్తీర్ణంలో.. కూరగాయల సాగు చేస్తుంటారు. సీజన్‌కు అనుగుణంగా కూరగాయలను పండించి.. స్వయంగా , మార్కెటింగ్ చేసుకుంటుండటంతో మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే, రైతు మంద తిరుపతి గత 12 ఏళ్లుగా శాశ్వత పందిర్లపై, తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. పంట వెనుక పంటలను మార్చుతూ.. ఏడాదికి 2 పంటలను పండిస్తున్నారు.

ప్రస్తుతం రెండున్నర ఎకరాలలో కాకర సాగుచేస్తున్నారు. ఎత్తైన బెడ్లపై, మల్చింగ్ ఏర్పాటు చేశారు. మొక్కలకు డ్రిప్ ద్వారా నీటితడులు, ఎరువులను అందిస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని నివారించేందుకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. మార్కెట్‌లో ధరలు కూడా స్థిమితంగా ఉండటంతో మంచి లాభాలను పొందుతున్నారు.

READ ALSO : Pandiri Kaakara: పందిరి కాకర సాగుతో అధిక లాభాలు..!

రైతు తిరుపతి పందిరి సాగు ద్వారా కూరగాయల పండించే విధానాన్ని చూసి… చుట్టుప్రక్కల రైతులు కూరగాయల సాగు చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించి, కొంత ఆర్థిక తోడ్పాటు అందిస్తే , కూరగాయలు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్థానిక రైతులు చెబుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు