Natu Kolla Pempakam : వర్షాకాలంలో పెరటికోళ్ల సంరక్షణ

ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురవుతాయి. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

Care Of Poultry

Natu Kolla Pempakam :  వర్షాకాలం మొదలైంది.. అడపా దడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అధిక వర్షాలు పడితే కోళ్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్లకు అనేక వ్యాధులు ఆశిస్తాయి. కొన్ని కొన్ని సార్లు  చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో పెరటికోళ్లకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు ఏవిధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. నవీన్.

READ ALSO : Viruses In Chickens : కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పరిశ్రమ. రోజురోజుకు పెరుగుతున్న గుడ్లు, మాంసం వినియోగంతో వీటి పెంపకం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది, అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురవుతాయి. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు పెరటి కోళ్లకు వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. నవీన్.