Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల దశను పట్టి వాటిని రకరకాల చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. దీనికి తోడు రైతులు విచక్షణ రహితంగా ఎరువుల వాడకం కూడా వీటికి అనుకూలంగా మారాయి.

Agriculture Tips : ప్రస్తుతం వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరోవైపు విచక్షణ రహితంగా వాడుతున్న ఎరువులు, సరైన యాజమాన్య పద్ధతులు లేకపోవడంతో ఖరీఫ్ పంటలతో పాటు రబీలో వేసిన వేరుశనగ, శనగ పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. వీటని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్య పద్ధతుల పాటించాలని సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.

READ ALSO : ATM Cultivation : ఏటీఎం సాగు.. 70 సెంట్లలో 26 రకాల పంటలు

ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, కంది పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. చాలాచోట్ల పత్తితీలుతు తీస్తుండగా కొన్ని చోట్ల కాయదశలో ఉన్నాయి. వరి గింజ పాలుపోసుకునే దశలో ఉండగా, కందిపంట మొగ్గతోడిగే దశనుండి పూత సమయంలో ఉంది. మరోవైపు రబీ వేరుశనగ, శనగ పంటలను కొన్ని చోట్ల విత్తుకున్నారు.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

మరి కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే విత్తుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల దశను పట్టి వాటిని రకరకాల చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. దీనికి తోడు రైతులు విచక్షణ రహితంగా ఎరువుల వాడకం కూడా వీటికి అనుకూలంగా మారాయి.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

కాబట్టి .. చివరి దశలో ఉన్న పంటలనుండి.. విత్తబోయో రబీ పంటల నుండి అధిక దిగుబడులను పొందాలంటే.. చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక వేళ వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.

ట్రెండింగ్ వార్తలు