Sugarcane Cultivation
తెలుగు రాష్ర్టాలలో సాగవుతున్న వాణిజ్యపంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరుకు ఆరు నుండి ఎనిమిది నెలల వయస్సులో వుంది. చాలావరకు జడచుట్లు కడుతున్నారు రైతులు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పురుగుల సమస్య ఏర్పడే అవకాశం ఉంది . కాబట్టి చెరకు తోటలను కాపాడుకోవాలంటే రైతులు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. సుధారాణి.
READ ALSO : Vijayashanthi : కేసీఆర్ పై విజయశాంతి పోటీ..?
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది. అయితే రైతులు జడచుట్ల తరువాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది. తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాల ఆగిన తరువాత వాతావరణం లోని వచ్చే వేడి వలన పొలుసు పురుగు, పిండినల్లి, ఎర్రనల్లి, నల్లపేను, దూదేకుల పురుగులు ఆశించి, ఆకుల రసాన్ని పీల్చి వేయడం వలన మొక్క పెరుగుదల ఆగిపోతుంది.
READ ALSO : Sugar Exports Ban : ఏడేళ్లలో మొదటిసారి చక్కెర ఎగుమతులపై నిషేధం ?
ఒకవేళ ఆ పురుగు ఆశించి చెరకు తోటలు కోత కొస్తే, ఆ చెరకు తోటల నుంచి వచ్చిన గడల యొక్క నాణ్యత తగ్గి పోయి, బెల్లం చేసినా, నల్లగా మారి, నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. సుధారాణి.