Cotton Cultivation : ఎత్తు మడులలో.. పత్తిసాగు ఎంతో మేలు

పత్తి మొక్కలున్న ఎత్తు మడికి అటు ఇటు కాలువలు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు పంట చేలల్లో వర్షపు నీరు ఈ కాల్వల్లో మాత్రమే నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. వర్షాలు ఈ ఏడాది మాదిరిగా బాగా ఎక్కువగా కురిస్తే.. పత్తి మొక్కలు ఎత్తు మడిలో ఉంటాయి కాబట్టి ఉరకెత్తే ఇబ్బంది ఉండదు.

Cotton cultivation

Cotton Cultivation : ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నారు. ఓ యేడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. అధిక వర్షం కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో బురదగా మారి పత్తి పంటలో ఎదుగుదల లోపించి దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యల నుండి పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు బెడ్ విధానంలో పత్తిసాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ సాగుకంటే 30 నుండి 40 శాతం అధిక దిగుబడిని పొందవచ్చంటున్నారు.

READ ALSO : Diseases in Groundnut : వర్షాధారంగా ఖరీఫ్ వేరుశనగ సాగు.. అధిక దిగుబడుల కోసం సమగ్ర సస్యరక్షణ

వాయిస్ ఓవర్ : సాధారణంగా పత్తిని సాగుచేసే రైతులు నల్లరేగడి, తేలికపాటి ఎర్రనేలల్లో సాగుచేస్తూ ఉంటారు. అదికూడా అచ్చులు, లేదా సాళ్ల  పద్దతిలో సాగుచేస్తూ ఉంటారు. అయితే   చాలా మంది రైతులు.. ఐదారు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే తీయగలుగుతున్నారు. ఎవరైనా తీసినా, 10 క్వింటాళ్లను మించలేకపోతున్నారు. అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించటం, చీడపీడల ఉధృతి పెరిగిపోతుంది. వీటిని అదుపు చేయటం కోసం అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది.

READ ALSO : Prawn Cultivation : పడిపోతున్న ధరలు, చుక్కలనంటుతున్న ఉత్పత్తి వ్యయం.. రొయ్యరైతు విలవిల

ఇంతఖర్చు చేసినా..  దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఎత్తుమడుల విధానంలో పత్తి సాగుచేయాలంటున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్  డా. ప్రవీణ్ కుమార్. సమతల భూమి మీద గొర్రుతో తోలి సాళ్లుగా పత్తి విత్తుకోవడం సాధారణ పద్ధతి. ఎత్తు మడుల పద్ధతిలో ట్రాక్టర్‌కు రెయిజ్‌డ్‌ బెడ్‌ మేకర్‌ అనే పరికరాన్ని జోడించడం ద్వారా మడులు తోలుకొని పత్తి విత్తుకోవాలి. ఈ మడి 15–20 సెం.మీ. ఎత్తున ఉంటుంది. మడి వెడల్పు ఆ భూమి స్వభావాన్ని బట్టి, అక్కడి వర్షపాతాన్ని బట్టి.. ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మడి పైనే పత్తి విత్తనాలు నాటుకోవాలి.

READ ALSO : Cotton Crop : ప్రత్తి పంటలో చీడపీడలకు కారణమయ్యే తుత్తుర బెండ, వయ్యారిభామ! వీటి నివారణ ఎలగంటే?

పత్తి మొక్కలున్న ఎత్తు మడికి అటు ఇటు కాలువలు ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు పంట చేలల్లో వర్షపు నీరు ఈ కాల్వల్లో మాత్రమే నిల్వ ఉండి భూమిలోకి ఇంకుతుంది. వర్షాలు ఈ ఏడాది మాదిరిగా బాగా ఎక్కువగా కురిస్తే.. పత్తి మొక్కలు ఎత్తు మడిలో ఉంటాయి కాబట్టి ఉరకెత్తే ఇబ్బంది ఉండదు. మొక్కల వద్ద నీరు నిల్వ లేకపోవడంతో అవి ఏపుగా పెరుగుతాయి. గాలి సరిగా ఆడుతుంది. ఎండ బాగా తగులుతుంది. తెగుళ్లు కూడా అంతగా ఆశించవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

READ ALSO : Cotton Cultivation : పత్తిసాగుకు సన్నద్దమవుతున్న రైతులు.. సాగులో మేలైన యాజమాన్యం

వర్షాధార భూముల్లో ఎత్తు మడులపై పత్తి పంటలను సాగు చేయటం ద్వారా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. వర్షాలు ఎక్కువైతే మడుల పక్కన కాలువల్లోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. పంట ఉరకెత్తదు. వర్షాలు తక్కువగా కురిసినా.. ఎక్కడి నీరు అక్కడే ఇంకుతుంది కాబట్టి భూమిలో తేమ ఉండి పంట దిగుబడి దెబ్బతినదు. అంటే.. వర్షాలు అటూ ఇటూ అయినా ఎత్తుమడుల వల్ల దిగుబడి దెబ్బతినదు. 30–40 శాతం అదనంగా దిగుబడి పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు