Cultivation of Coconut
Cultivation of Coconut : ఎప్పటికప్పుడు మార్కెట్ పోకడల్ని గమనిస్తూ.. వాటికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే రైతుకు ఎలాంటి నష్టాలు రావు. ఈ నియమాన్నే ఇప్పుడు చాలా మంది రైతులు పాటిస్తున్నారు. ఈ కోవలోనే అరటిలో కొబ్బరి, జాజికాయ జాపత్రిని అంతర పంటలుగా సాగుచేస్తున్నాడు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. ఏడాది పోడవునా ఏదో ఒక పంటపై దిగుబడిని పొందేందుకు సిద్ధమవుతున్నారు.
READ ALSO : Luxury Homes: హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు భారీ డిమాండ్.. 20 రెట్లు పెరిగిన విక్రయాలు
ఏడాది పొడవునా అరటి సాగుకు అనుకూలంగా ఉండడంతో ఏపీలో లక్షల హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తున్నారు రైతులు. వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించు కోవడం ఇందుకు కారణం. అయితే వాతావరణ పరిస్ధితుల ప్రభావం కారణంగా ఒక్కో ఏడాది అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
READ ALSO : Wedding Day: పెళ్లి రోజునే దంపతులను విడగొట్టిన కేకు.. విడాకుల కోసం కోర్టుకు భార్య
అంతే కాదు అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి పంటలో అంతర పంటలుగా స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలం, సూర్యచంద్రరావుపేట గ్రామానికి చెందిన రైతు వీరభద్రరావు . తనకున్న 10 ఎకరాల కొబ్బరి, అరటితోటల్లో అంతర పంటగా 6 నెలల క్రితం జాజికాయ జాపత్రి మొక్కలు నాటారు. అరటి ఈ పంటతో తీసివేయనున్నారు. అయితే మూడెళ్ల తరువాత జాజికాయ, కొబ్బరి దిగుబడులను పొందనున్నారు.