Solar Power Cultivation : సోలార్ విద్యుత్‎తో పంటల సాగు

Solar Power Cultivation : 215 అడుగుల్లో నీరు వచ్చింది. అయితే బోరు నడవాలంటే కరెంట్ కావాలి. కానీ 2 కిలో మీటర్ల దూరంలో విద్యుత్ లైన్ ఉంది.

Solar Power Cultivation : అదో కుగ్రామం. అక్కడ వ్యవసాయానికి అన్ని ప్రతికూల పరిస్థితులే. బోరు వేస్తే నీళ్లు పడటం గగనమే. ఒకవేళ నీళ్లు వచ్చినా.. కరెంట్ ఉండదు.. కానీ తన పొలంలోబోరు సక్సెస్ కావడంతో ఓ యువరైతు తక్కువ ధరతో వాడేసిన సోలార్ ప్యానెల్లు  ఏర్పాటు చేసుకొని మొక్కజొన్న, శనగ పంటలను సాగుచేస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

నిర్మల్ జిల్లా, దిలావర్ పూర్ మండలంలోని మాడేగాం గ్రామం.. ఇక్కడ వర్షాలే సాకుగు ఆధారం  . మైదాన ప్రాంతాలకంటే దాదాపు 100 మీట్లర ఎత్తులో ఉంటుంది ఈ పల్లెటూరు. బోర్లు వేసినా నీళ్లు పడుతాయని గ్యారంటీ లేదు. ఇప్పటికే ఎంతో మంది వేయించి ఆశలు వదులుకున్నారు. కానీ యువరైతు నార్వాడే గంగాధర్ తనకున్న  పొలంలో ఇటీవల కాలంలో ఓ బోరు వేశారు.  215 అడుగుల్లో నీరు వచ్చింది. అయితే బోరు నడవాలంటే కరెంట్ కావాలి. కానీ 2 కిలో మీటర్ల దూరంలో విద్యుత్ లైన్ ఉంది.

అక్కడినండి పొలం వద్దకు కరెంట్ తీసుకరావాలంటే దాదాపు రూ. 4 లక్షలు ఖర్చవుతుంది. అన్ని డబ్బులులేని రైతు సోలార్ కోసం ప్రయత్నం చేశారు. పక్కన్నే ఉన్న మహారాష్ట్రలో సోలార్ తో బోర్లు నడవడం చూసి..  అక్కడికి వెళ్లి సెంకడ్ హ్యాండ్ 335 వాట్ల 9 సోలార్ పలకలు  లక్షరూపాయలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వాటిని తన పొలంలో బిగించి పాతాళంలో ఉన్న నీటిని పైకి తీసుకొచ్చారు. మొక్కజొన్న, శనగ పంటను వేసి వాటిని సోలార్ విద్యుత్ ద్వారా సాగు నీరు అందిస్తూ.. పంటు పండిస్తున్నారు.

Read Also : Papaya Plantations : బొప్పాయిలో చీడపీడల బెడద.. నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు 

ట్రెండింగ్ వార్తలు