Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా పసుపు సాగు

రెండేళ్లుగా బొప్పాయి తోటలో అంతర పంటగా పసుపును సాగుచేస్తున్నారు. సెమీఆర్గానిక్ పద్ధతిలో సాగుచేస్తున్న రైతు.. డ్రిప్ ద్వారా ఎరువులు, నీటి తడులను అందిస్తున్నారు. ఒకే క్షేత్రంలో ఒకే పెట్టుబడితో.. రెండు పంటలపై ఆదాయం పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

intercrop in papaya

Intercrop In Papaya : బొప్పాయి పంట అనగానే వైరస్‌ తెగులు గుర్తొస్తుంది. వైరస్‌ ఒక్కసారి తోటలో కనిపించిందంటే ఇక ఆ తోటపై ఆశలు వదులుకోవల్సిందే.. అయితే ఈ తెగుళ్లను అరికట్టేందుకు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు బోప్పాయిలో అంతర పంటగా పసుపు సాగుచేస్తూ.. సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఒకే పెట్టుబడితో రెండు పంటల నుండి దిగుబడులను పొందుతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

READ ALSO : Papaya Cultivation Techniques : బొప్పాయిలో చీడపీడల బెడద – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

బాపట్ల జిల్లా, అద్దంకి మండలం, కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు చింతా వెంకటేశ్వరరెడ్డి మొత్తం 4 ఎకరాల్లో బొప్పాయిలో అంతర పంటగా పసును వేశారు. గతంలో సంప్రదాయ పంటలు పండించి నష్టాలను చవిచూసిన ఈయన ఆరేళ్లుగా బొప్పాయి తోటలను పెంచుతున్నారు.

మొదట్లో వైరస్ తెగుళ్లతో తీవ్రంగా నష్టాలను చవిచూశారు. వీటి నుండి గట్టెక్కేందుకు అంతర పంటలు సాగుచేయాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్లుగా బొప్పాయి తోటలో అంతర పంటగా పసుపును సాగుచేస్తున్నారు. సెమీఆర్గానిక్ పద్ధతిలో సాగుచేస్తున్న రైతు.. డ్రిప్ ద్వారా ఎరువులు, నీటి తడులను అందిస్తున్నారు. ఒకే క్షేత్రంలో ఒకే పెట్టుబడితో.. రెండు పంటలపై ఆదాయం పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

READ ALSO : Black Thrips Pest : మామిడి, బొప్పాయితో పాటు ఇతర ఉద్యానవన తోటల్లో నలుపు రంగు తామర పురుగుల నియంత్రణ!

బొప్పాయి కాయపై ఆదాయం మాత్రమే కాదు, పంట చివరలో బొప్పాయి పాలపై కూడా ఆదాయం పొందుతున్నారు రైతులు. వ్యాపారులు ఎకరాతోటను 20 – 50 వేలకు  వరకు వెచ్చించి, నాణ్యత  లేనిక కాయలనుండి పాలు తీసి అమ్ముకుంటున్నారు. అదే కాయలను చెర్రిగా తయారు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు