Vegetable Cultivation : వరిలో గట్లపై కూరగాయల సాగు

రైతులు లాభాల బాట పట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు పొలాల గట్లపై పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కంది, మునగ, కూరగాయల విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు.

Vegetable cultivation

Vegetable Cultivation : వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. దిగుబడులు మాత్రం  తగ్గుతన్నాయి. వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్ లో ధరలు రావడంలేదు. దీంతో ఆరుగాలం కష్టపడుతున్న అన్నాదాతకు అప్పుల తిప్పలు తప్పడంలేదు.  కాలనికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేపడితే.. నష్టాల సేద్యాన్ని లాభాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు . ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన రైతులు వరిగట్లపై కూరగాయల పంటలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

ఒకప్పుడు రైతులు సమీకృత వ్యవసాయం చేసేవారు. సమీకృత వ్యవసాయం అంటే సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు.. అనుబంధంగా పాడి, కోళ్లు, జీవాల పెంపకం అన్నమాట. పాడి పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు .. పంట పొలాలకు.. పంట పొలాల వ్యర్థాలు పాడిపరిశ్రమకు వాడుతూ.. పెట్టుబడులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులను పొందేవారు. అంతే కాదు ఒకవేల పంట దెబ్బతిన్నా.. అనుబంధ రంగాల ద్వారా ఆ లోటును పూడ్చుకునేవారు.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

అయితే రాను రాను వాణిజ్య పంటలకు మార్కెట్ లో అధిక ధరలు పలకడం.. రైతులు వీటిసాగుకు మొగ్గుచూపారు. అంతే కాదు అనుబంధ రంగాలను వదిలేసి ఏకపంట విధానాన్నే పాటించారు. అయితే, ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో ఒక్కో సారి పంటదెబ్బతిని పూర్తిగా నష్టాలను చవిచూసేవారు. కానీ విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, గొల్లపల్లి గ్రామంలోని రైతులు మాత్రం భిన్నం. ప్రతి ఏటా ఖరీఫ్ లో వరిసాగుచేస్తూనే.. గట్లపై అపరాలు, తీగజాతి కూరగాయలను సాగుచేస్తుంటారు. తమ ఇంటి అవసరాలు తీరగ.. మిగిలిన కూరగాయలను మార్కెట్ లో అమ్ముతూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.

READ ALSO : న్యూట్రీ గార్డెన్స్‌: ఏ ఊళ్లో పండిన సేంద్రీయ పంటలు ఆ ఊరివాళ్లకే

రైతులు లాభాల బాట పట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు పొలాల గట్లపై పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కంది, మునగ, కూరగాయల విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు. దీంతో చాలామంది ముందుకొస్తున్నారు. గట్లపై కంది, మునగ, అరటి, బంతి, బీర, బీన్స్ లాంటి తీగజాతి కూరగాయలను సాగు చేయడం ద్వారా రూ.5-10 వేలు వరకు అదనపు ఆదాయం వస్తుందని చెబుతున్నారు.