Cotton Varieties : రైతులకు అందుబాటులో దేశీ పత్తి రకాలు

బిటి పత్తి హైబ్రిడ్‌లు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్‌బిటి పత్తి మాయలో పడ్డారు.  నానాటికి పంట దిగుబడులు కూడా తగ్గుతూ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది.

Cotton Varieties

Cotton Varieties : దేశవ్యాప్తంగా బీటీ పత్తి రైతులు గులాబీ రంగు పురుగు, ఇతర చీడపీడల బెడదతో తల్లడిల్లుతున్నారు. బీటీ పత్తి పురుగుమందుల వాడకాన్ని, పెట్టుబడులను తగ్గిస్తుందని ఆశించారు. అనుకున్నదొకటి. అయ్యిందొకటి. కరువు కాటకాలు, చీడపీడల ధాటికి బీటీ పత్తి విఫలం కావటంతో రైతులు అప్పులపాలై,  ఆత్మహత్యల పాలవుతున్నారు.

READ ALSO : Pests In Sugarcane Plantations : లేత చెరకుతోటల్లో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ నేపథ్యంలో అతితక్కువ ఖర్చు.. శ్రమతో దేశీవాళి పత్తి సాగుచేస్తే అధిక లాభాలను పొందవచ్చని.. దేశవాళీ పత్తి రకాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ముదోల్ వ్యవసాయ పరిశోదనా స్థానం శాస్త్రవేత్త విజయ్ కుమార్.

READ ALSO : Korra Cultivation : అండు కొర్రల సాగులో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు

మన దేశంలో పత్తి ప్రముఖ వాణిజ్య పంట. అయితే మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. దేశంలో వాడే 60 శాతం పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

READ ALSO : Shrimp Cultivation : వర్షాకాలంలో రొయ్యల సాగుకు పొంచి వున్న వ్యాధుల ముప్పు

బిటి పత్తి హైబ్రిడ్‌లు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్‌బిటి పత్తి మాయలో పడ్డారు.  నానాటికి పంట దిగుబడులు కూడా తగ్గుతూ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది.

READ ALSO : Kakara Sagu : శాశ్వత పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు రూ. 80 వేల నికర ఆదాయం

ఈ నేపధ్యంలో నిర్మల్ జిల్లా ముదోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం.. దేశీపత్తి రకాలను రైతులకు అందుబాటులో ఉంచింది. విత్తనం కావాల్సిన రైతులు 9885551624 నంబర్ ను సంప్రదిస్తే విత్తనాలను అందిస్తామని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త విజయ్ కుమార్.

ట్రెండింగ్ వార్తలు