baby corn cultivation
Baby Corn Cultivation : ఇటీవల కాలంలో హోటల్లు, సినిమాహాళ్లు, సూపర్ మార్కెట్ లు, విందులు, వినోదాలు ఇలా నలుగురు కలిసే ప్రాంతాలలో ఎక్కడ చూసినా, స్వీట్ కార్న్, బేబీకార్న్ రుచులు ఊరిస్తున్నాయి. సాధారణ మొక్కజొన్న దాణాగా ఉపయోగపడుతుంది కాబట్టి, వాటికి పరిశ్రమ స్థాయిలో వినియోగం , గిరాకీ ఎక్కువగా ఉంటే.. ఈ స్వీట్ కార్న్ , బేబీకార్న్ ల వాడకం, ఆహార పరిశ్రమలో అంతకంతకు పెరుగుతూ ఉంది. అంతే వేగంగా వీటి సాగు కూడా విస్తరిస్తోంది.
READ ALSO : Maize Farming : రైతుకు మంచి అదాయవనరుగా మొక్కజొన్నసాగు !
ఒకప్పుడు గింజకోసం వాణిజ్యసరళిలో సాగుచేసే మొక్కజొన్న, నేడు స్వీటకార్న్, బేబీకార్న్, పేలాలు, దాణా రూపంలోను, పశువులకు మేతగా…ఇలా పలు రకాలుగా వినియోగంలో వుంది. బేబీ కార్న్ సాగు గతంలో పరిమితంగా వున్నా… నేడు మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా దీని వినియోగం పెరిగింది. దీంతో మార్కెట్ డిమాండ్ ను అందిపుచ్చుకుంటూ, తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో దీనిసాగు ఊపందుకుంది. అందుకు తగ్గట్లుగానే అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హైబ్రిడ్ మొక్కజొన్న రకాలు రైతులకు అందుబాటులో వుండటంతో సాగు మరింత లాభదాయకంగా మారింది.
READ ALSO : Kidney Stone : కిడ్నీల్లో రాళ్ల సమస్యా? మొక్కజొన్న పొత్తులపై ఉండే పీచుతో!
గతంలో మార్కెటింగ్ ఇబ్బందులున్నా… రిటైల్ మార్కెట్లు, సూపర్ బజార్ల రాకతో వీటికి డిమాండ్ పెరిగింది. స్టార్ హోటళ్ళు, సినిమా హాళ్ళలో వాడకం పెరగటంతో, సంవత్సరం పొడవునా బేబీకార్న్ సాగును దఫదఫాలుగా చేపడుతూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. సాధారణ మొక్కజొన్న కోసం 100 నుండి 120 రోజులు వేచిచూడాలి. అదే స్వీట్ కార్న్ అయితే 75 రోజులకు, బేబీకార్న్ అయితే ఇంకా ముందుగా అంటే రెండు నెలలకే అందివస్తుంది. ఈ పంటలను ఏకపంటగా, అంతర పంటగా సాగుచేస్తూ, మార్కెట్ అవసరాన్ని అందిపుచ్చుకొని లాభాల ఫలాన్ని చవిచూస్తున్నారు రైతులు. ఈ కోవలోనే విశాఖ జిల్లా, నర్సీపట్నం కు చెందిన రైతు అరుణకుమారి 2 ఎకరాల్లో దఫ దఫాలుగా బేబీకార్న్ సాగుచేపట్టి, సొంతంగా మార్కెట్ చేసుకుంటూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
READ ALSO : High Moisture Corn : మొక్కజొన్నలో తేమ వల్ల నష్టం జరగకుండా నివారిస్తే!
తక్కువకాలంలో రైతుకు మంచి నికర రాబడినిచ్చే పంటగా బేబీకార్న్ సాగు ప్రాచుర్యం పొందుతోంది. రైతు అరుణకుమారి 2 ఎకరాలలో రూ. 30 వేల పెట్టుబడి పెట్టి సాగుచేసిన రైతు అరుణకుమారి, 2 నెలల్లోనే ఎకరాకు 2 వేల కిలోల దిగుబడి తీస్తున్నారు. మార్కెట్ లో కిలో ధర రూ. 26 చొప్పున అమ్ముతున్న రైతు , ఎకరాకు 52 వేల ఆదాయం పొందుతున్నారు. రెండు ఎకరాలకు రూ. 1 లక్షా 4 వేల ఆదాయం పొందుతున్నారు . పెట్టుబడి రూ. 30 వేలు పోను, 2 నెలల్లోనే రూ. 70 వేల నికర ఆదాయాన్ని పొందుతున్నారు రైతు. ఈ రైతును చూసి మిగితా రైతులు కూడా తక్కువ సమయంలో , అధిక దిగుబడుల వచ్చే పంటలను ఎంచుకొని సాగుచేస్తే, అధిక ఆదాయం పొందవచ్చు.