Bt Cotton
Bt Cotton : తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. వాణిపంటల్లో ఒకటైన పత్తి పంట సాగు ద్వారా రైతులు మంచి అదాయాన్ని పొందుతున్నారు. అయితే రైతులు సరైన యాజమాన్య పద్దతు పాటించటం ద్వారా పత్తిలో అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా పత్తిపంటలో తామర పురుగులు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. వాతావరణం పొడిగా ఉండే పరిస్ధితుల్లో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వర్షాలు అధికంగా ఉన్న సమయంలో, చలి వాతావారణంలో ఎక్కవగా పంటను ఆశిస్తాయి.
తల్లి పురుగులు , పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి ఆకులను గీకి రసం పీలుస్తాయి. దీని వల్ల ఆకు పై భాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఆకు ఆడుగు భాగం వెండిలా మెరిసే చారలు కలిగి ఉండి ఆకు వంకరలు తిరిగి ఉంటుంది. ఆకులు ముడతలు పడి చివరికి పెళుసుగా మారి ఎండిపోతాయి. ఈ పురుగులు వైరస్ తెగులు వ్యాప్తికి కారణమౌతాయి.
పురుగులు సన్నగా, పొడవుగా ఉండి చివరి భాగంలో పైకి వంపు తిరిగి ఉంటాయి. పిల్ల పురుగులకు రెక్కలుండవు. పెద్ద పురుగులు రెక్కలు కలిగి ఉంటాయి. చాలా చురుకుగా కదులుతుంటాయి. తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ అనే మందును లీటరు నీటికి 2మి.లీ , లేదా స్పినోసాడ్ లీటరు నీటికి 0.3 మి.లీ చొప్పున పిచికారి చేయాలి.