Eggplant Gardens : వంగలో ఎర్రనల్లి ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది.  అసలే కరోనా ప్రభావంతో మార్కెట్ లు లేక పంటను అమ్ముకోలేక సతమతమవతున్న రైతులకు ఈ ఎర్రనల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Eggplant Gardens

Eggplant Gardens : తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వంగతోటలు సాగవుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ వుంది. 6 నెలలు కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా వుంది. వీటి తాకిడితో 30 నుండి 50 శాతం వరకు పంటను నష్టపోవాల్సి వస్తోంది. వంగను ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో వుంది. అయితే  బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కున్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవటంతో చీడపీడల బెడద ఎక్కువగా వుంది.

READ ALSO : Eggplant Cultivation : వంగసాగులో చీడపీడల బెడద! పాటించాల్సిన జాగ్రత్తలు

ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది.  అసలే కరోనా ప్రభావంతో మార్కెట్ లు లేక పంటను అమ్ముకోలేక సతమతమవతున్న రైతులకు ఈ ఎర్రనల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

READ ALSO : Cultivation Of Brinjal : బెంగలేని వంగ సాగు.. ఏడాదిపాటుగా మంచిదిగుబడులు

వంగ తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్న ఎర్రనల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి

ట్రెండింగ్ వార్తలు