Farmers need to be aware of the method of seed production in soybean!
Seed Production In Soybean : సోయా చిక్కుడు ఇతర పప్పుధాన్యాపు పైర్ల కంటే ఎక్కువ దిగుబడి ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అధిక స్దాయి విస్తీర్ణంలో రైతులు సోయా చిక్కుడు సాగు చేస్తున్నారు. దిగుబడి ఎకరాకు 1000 కిలోల వరకు ఉంటుంది. పంటకు కావాల్సిన విత్తనాన్ని ఎంపిక చేసుకునే విషయంలో రైతులు సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఈ పంటసాగుకు విత్తన ఎంపికే కీలకం.
సోయా సాగుకు అవసరమైన విత్తనోత్పత్తి ; సోయా చిక్కుడు మొలక శాతాన్ని త్వరగా కోల్పోతుంది. సంవత్సరం పైబడిన విత్తనం మొలక శాతం తక్కువగా ఉంటుంది. ఖరీఫ్ లో పండించిన విత్తనాన్ని మరల ఖరీఫ్ వరకు నిల్వ చేసి తిరిగి ఖరీఫ్ లో నాటడం వల్ల మొలక శాతం తగ్గుతుంది.
పంటలో విత్తనోత్పత్తి అనేది నాణ్యతా ప్రమాణాలకు తగినట్లు చేపట్టాలి. విత్తనాన్ని 7శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టి పాలిథిన్ సంచుల్లో నిల్వ చేయాలి. గోనె సంచులు వాడితే మాత్రం తేమ శాతం 10 ఉండేలా చూసుకోవాలి.
విత్తనోత్పత్తికి సంబంధించి మాత్రమే సాగుచేస్తే సిఫారుసు మేరకు సేంద్రీయ, రసాయనిక ఎరువులను అందించాలి. విత్తనోత్పత్తిని నీటి వసతి ఉన్నచోట మాత్రమే చెపట్టి, అవసరం ఉన్న సమయంలో నీటితడులు ఇవ్వాలి. దీని వల్ల నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి సాధ్యమౌతుంది.
విత్తన పంటలో కలుపు నివారణ, అంతర కృషి, ఎరువుల, సస్యరక్షణ సకాలంలో చేపట్టటం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. పంట పెరిగే దశ, పూత దశ, కాయ తయారయ్యేప్పుడు , కాయలు పూర్తిగా తయారైన దశలో బెరుకులు తీసే పనిని చేపట్టాలి.
బెరుకులు ప్రధాన పంట రంకంతో పోల్చినప్పుడు మొక్కల ఎత్తులో తేడా ఉంటుంది. పూల రంగు వేరుగా ఉంటుంది. కాయ సైజు, కాయ గింజల సంఖ్య, గింజ రంగులో తేడా ఉంటుంది. ఇలాంటి మొక్కలను గుర్తించి క్షేత్రం నుండి వేరు చేయాలి.
పంట కోత , సరిగా ఎండబెట్టటం, శుభ్రమైన విత్తనాన్ని తయారు చేయటంతోపాటుగా, శుభ్రమైన సంచులలో నిల్వ చేయాలి. కల్తీలను నిరోధించాలి. అన్ని ప్రమాణాలు పాటించి తయారైన విత్తనం స్వచ్ఛత కలిగి ఉండి అధిక మొలకశాత కలిగి ఉండి దిగుబడి బాగా ఉంటుంది.