Cultivation of Leafy Vegetables : ఏడాది పొడవున ఆకు కూరల సాగుతో నిత్యం ఆదాయం పొందుతున్న రైతులు

కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పలు రకాల ఆకుకూరలు సాగుచేస్తూ ఉంటారు. వేసిన 25 రోజుల్లోనే పంట చేతికి వస్తుండటం.. వారం రోజుల పాటు పంట కోస్తూ.. స్థానిక మార్కెట్ లలో అమ్ముతూ ప్రతి రోజు ఆదాయం పొందుతున్నారు.

Farmers who get regular income from growing leafy vegetables throughout the year

Cultivation of Leafy Vegetables : బాపట్ల జిల్లా, చీరాల మండలానికి చెందిన ఆక్కడి రైతులు అధికంగా ఆకుకూరలే పండిస్తారు. ఎటూ చూసినా ఆకుకూరల తోటలు పరుచుకున్న పచ్చదనమే ప్రతిబింభిస్తుంది. కొన్నేళ్లుగా ఇక్కడి వారికి ఇదే వ్యాపకం, జీవనాధారం. తక్కువ పెట్టుబడితో పలు రకాల ఆకుకూరలు పండిస్తూ దగ్గరలోని మార్కెట్ లో అమ్ముతున్నారు  రైతులు. నిత్యం లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు.

బాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని పాతచీరాల, జాండ్రపేట గ్రామరైతులు అధికంగా ఆకుకూరలే సాగుచేస్తుంటారు. జీవనోపాధులపై సరిగ్గా ఆలోచన చేస్తే ఉన్నంతలోనే ఉపాధి బాటలు వేసుకోవచ్చని వీరు నిరూపిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పలు రకాల ఆకుకూరలు సాగుచేస్తూ ఉంటారు. వేసిన 25 రోజుల్లోనే పంట చేతికి వస్తుండటం.. వారం రోజుల పాటు పంట కోస్తూ స్థానిక మార్కెట్ లలో అమ్ముతూ ప్రతి రోజు ఆదాయం పొందుతున్నారు.

అన్నీ ఇసుక భూములే కావటం. ఈ భూమి గోంగూర, పూదీన లాంటి ఆకు కూరల పంటలకు అనువైనవి కావడంతో రైతులు ఈ పంటలనే పండిస్తుంటారు. అంతే కాదు ఏడాది పోడవునా దిగుబడి వచ్చేలా, ప్రణాళిక బద్ధంగా మడులు మడులుగా సాగుచేస్తున్నారు. ప్రతి రోజు కుటుంబ సభ్యులంతా కలిసి పొలంలో పనిచస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

గోంగూర కు సంబంధంచి కిలో విత్తనానికి 100రూపాయలు ఖర్చువుతుంది. విత్తిన 3 రోజులకే మొలక వస్తుంది. రోజుకు ఒక తడిని నీటిని అందిస్తారు. నాటిన 25 రోజుల నుండి కోత ప్రారంభమౌతుంది. వారం రోజుల వరకు కోత వస్తుంది. ఎకరానికి 300 నుండి 400 కట్టలు వస్తాయి. అరఎకరాకు పెట్టుబడిగా 7 నుండి 8వేల రూపాయలు ఖర్చవుతుంది.

ట్రెండింగ్ వార్తలు