Rabi Fertilizers : రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యం
Rabi Fertilizers : కొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీకాలంలో స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు
- Sreehari A
- Published On : January 29, 2024 / 04:25 PM IST
Fertilizers to be Applied in Rabi
Rabi Paddy Fertilizers : రబీ వరిసాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన ఉండటంలేదు. శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలను పట్టించుకోకుండా తోటి రైతులు వాడుతున్నారని పొలంలోనూ అవసరం ఉన్నాలేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఎరువులను సిఫార్సు మేరకు సమయానుకూలంగా వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త, డా. నాగభూషనం.
Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం
శాస్త్రవేత్తల సలహాల పాటిస్తే అధిక దిగుబడులు :
నీటి వసతి వున్న ప్రాంతాల్లో రబీ వరిసాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు వరినాట్లు పూర్తి కావచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీకాలంలో స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు కనుక, వరిపైరులో పిలలుచేసే సమయం తక్కువ వుంటుంది.
అందువల్ల పంట దశనుబట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త, డా. నాగభూషనం. ఎరువులు వేసే టప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ప్రాంతాల్లో రైతులు ఎరువులతో పాటు గుళికలను కలిపి చల్లుతుంటారు. ఇలా చల్లడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గడమే కాకుండా గుళికల పనితనం కూడా తగ్గుతుంది. అలాగే ఎరువులు చల్లేటప్పుడు నీరు పల్చగా ఉండే విధంగా చూసుకుని చల్లితే ఎరువుల వినియోగం పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చేందుకు వీలుంటుంది.
Read Also : School Farming : కూరగాయల సాగు.. స్కూలే తోట.. విద్యార్థులే రైతులు..
