School Farming : కూరగాయల సాగు.. స్కూలే తోట.. విద్యార్థులే రైతులు..
School Farming : ఇప్పుడు ఆ విద్యార్థులే పాఠశాల ఆవరణంలో రకరకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తున్నారు.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

School Farming
School Farming : అదో నవోదయ విధ్యాలయం . 450 మందికి పైగా పిల్లలు.. విద్యార్థులు అంటే చదువేనా… కాదు.. వారికీ మానసిక ప్రశాంతంత కావాలి. అందుకోసం ఆ స్కూల్ నిర్వాహకులు.. వ్యవసాయాన్ని నేర్పుతున్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులే పాఠశాల ఆవరణంలో రకరకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తున్నారు.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు
ఈ స్కూల్ చూడండి… ఇక్కడి విద్యార్థులు విద్యాభ్యాసమే కాదు వ్యవసాయమూ చేస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం, వేలేరు నవోదయ విద్యాలయం ఇది. సుమారు 450 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. 50 మంది ఉపాధ్యాలు ఉన్నారు.
చదువుకుంటూనే కూరగాయలు పండిస్తున్న విద్యార్థులు :
పాఠశాల ఆవరణలో ఉన్న 2 ఎకరాల స్థలంలో గురువుల సహకారంతో వీరే స్వాయంగా వ్యవసాయం చేస్తున్నారు. పలు రకాల కూరగాయలు పండిస్తున్నారు. రోజులు మారాయి.. కెరీర్ ఓరియెంట్ చదువులు.. పట్టణ జీవనం.. నిత్యం ఉరుకులు పరుగులు.. చిన్నారులకు గ్రామాలతో పరిచయం తగ్గిపోవడం.. వంటి సమస్యలతో వ్యవసాయానికి దూరమవుతున్నారు..
చాలా మంది మన ప్రాంతంలో పండే పంటలు కూడా గుర్తించలేకపోతున్నారు.. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సహకారంతో చదువుకుంటూనే ఖాళీ సమయంలో పంటలు పండిస్తున్నారు విద్యార్థులు. వచ్చిన కూరగాయలను వండుకొని తింటున్నారు.
Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం