Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

Rabi Sesamum Cultivation : నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో, మంచి డిమాండ్ ఉండటంతో, ఎగుమతుల ద్వారా ఏటా, మనదేశం 2 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.

Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

Rabi Sesame seeds Cultivation in telugu states

Updated On : January 25, 2024 / 2:25 PM IST

Rabi Sesame Cultivation : నీటి వసతి వున్న రైతాంగం  రబీ పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా వుండి, దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. రాజేశ్వర్ నాయక్.

Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ

నువ్వు, అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50 శాతం, ప్రొటీన్లు 20 నుండి 25 శాతం వరకూ ఉంటాయి. వేసవి కాలంలో రెండు మూడు తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి, రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో, మంచి డిమాండ్ ఉండటంతో, ఎగుమతుల ద్వారా ఏటా, మనదేశం 2 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో రెండో పంటగా డిసెంబర్ చివరి వారం నుండి జనవరి రెండో చివరి వరకూ నువ్వును విత్తుతారు.

అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు :
కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు మొదటి పక్షం నుంచి, జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక..  సకాలంలో విత్తడం.. చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు  ప్రధాన శాస్త్రవేత్త డా. రాజేశ్వర్ నాయక్.

రబీలోవేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది.  ప్రస్థుతం మార్కెట్లో  తెల్ల నువ్వు రకాలు క్వింటా 12 వేల నుంచి 14 వేల ధర పలుకుతున్నాయి. ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుండటంతో రబీకి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం .అయితే సమగ్ర ఎరువులు, నీటియాజమాన్యం కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు.

నువ్వు ఆకులు, కాయలు పసుపు రంగుకు రాగానే కోతకోయాలి . కాయ పూర్తిగా ఎండు వరకు వదలి వేసిన, కాయ పగిలి నువ్వులు రాలి పోతాయి. కాబట్టి రైతులు పంట పక్వదశను గుర్తించి సకాలంలో పంట కోత చేపట్టాలి. కాయలో 60 నుండి 100 నువ్వు గింజలు ఉంటాయి. కాబట్టి కోతానంతరం  నిల్వ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కాయ పసుపు రంగుకు వచ్చి కొద్ది పచ్చిగా వున్నప్పుడే కోతచేసి, కంకులను చినచిన్న కట్టలులుగా కట్టి, కాయలున్న భాగంపైకి ఉండేలా, శుభ్రంగా వున్న కళ్లంలో ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది.

Read Also : Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు