Mango Cultivation
Mango Cultivation : మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందటానికి, తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్థుతం తోటల్లో కాయకోతలు దాదాపుగా పూర్తికావచ్చాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15రోజులనుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్తచిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
READ ALSO : High Yielding Rice Varieties : రైతులకు అందుబాటులో నూతన వరి రకాలు
మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి వుంటుంది . కనుక వేసవిలో కాపు తీసుకున్న తర్వాత మళ్లీ చెట్లకు కొత్త శక్తిని ఇచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతి నివ్వాల్సి వుంటుంది.
READ ALSO : Goat Farm : శాస్త్రీయ పద్ధతిలో పలు మేకజాతుల పెంపకం
ప్రస్థుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా , మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటితడి ఇచ్చే సౌకర్యం వున్న తోటల్లో నీటితడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత కాత రావాలంటే జూన్ , జులై, ఆగస్టు నేలలో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.