Good Profit In Dry Crops
Dry Crops : తక్కువ సమయంలో ఎక్కువ లాభాలకు చిరునామా ఆరుతడి పంటలు. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడులు, ఇతర ఖర్చులతో వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను సాగు చేయడం మేలు. మార్కెట్‌కు అనుగుణంగా సాగు చేయడంతో రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే ఏపంటలు ఏ సమయంలో వేయాలి..? ఎలాంటి యాజమాన్య పద్ధతుల చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రబీలో కూడా బావుల కింద, చెరువల కింద తేలికపాటి భూముల్లో సైతం వరి సాగవుతుంది. రబీ కాలంలో , నీటి వనరులు, సరిగ్గాలేకపోవటం, విద్యుత్ కొరత సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటం.. వరిసాగు లాభదాయకం కాదు. కాబట్టి రబీ కాలంలో ఆహార పంటలైన మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు , కొర్రలు వంటి పంటలు సాగుచేసుకుంటే తక్కువ పెట్టుబడితో .. అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది.
అంతే కాదు .. ప్రస్తుతం మార్కెట్ లో వీటికి డిమాండ్ పెరగడంతో అధిక లాభాలను ఆర్జించవచ్చు. అయితే ఏ ఏ పంటలు ఏసమయంలో వేసుకోవాలి.. వాటి యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్ర వేత్త డా. రాజేశ్వర నాయక్ .
Read Also : Dry Sowing Paddy : నారులేదు… నాటు అవసరం లేదు – నేరుగా పొడి దుక్కిలోనే వరిసాగు