Green Gram Varieties : ఖరీఫ్‌లో వేయదగిన పెసర రకాలు

Green Gram Varieties : సాగునీటి సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏకపంటగా లేదా, పత్తి, మొక్కజొన్న వేసే ప్రాంతాల్లో అంతర పంటగా స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలం. 

Green Gram Varieties : ఖరీఫ్‌లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో చేతికి వచ్చే పంట పెసర . ఈ పంట సాగుతో భూసారం పెరగడంతో పాటు, తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది . ప్రస్తుతం మెట్ట ప్రాంత రైతులు పెసరను ఏక పంటగాను లేదా అంతర పంటగా సాగుచేస్తే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. పెసరను జులై 15 వరకు విత్తుకునే అవకాశముంది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనువైన పెసర రకాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను రైతులు సాగుచేస్తున్నారు. అంతే కాదు ఏకపంటగాను, అంతర పంటగాను సాగుచేసుకునే వెసులు బాటు ఉంది.  సాగునీటి సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏకపంటగా లేదా, పత్తి, మొక్కజొన్న వేసే ప్రాంతాల్లో అంతర పంటగా స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలం.

జులై 15 వరకు సమయం కూడా ఉంది. అయితే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు. ఖరీప్ కు అధిక దిగుబడులను ఇచ్చే అనువైన పలు రకాల గుణగణాల గురించి  తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. సంధ్యా కిశోర్.

Read Also : Cotton intercropping : పత్తిలో అంతర పంటల సాగుతో అధిక లాభాలు

ట్రెండింగ్ వార్తలు