Green Leafy Vegetables Cultivation
Vegetables Cultivation : మనవద్ద పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మనవద్ద పంట పండదు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడదతో అనునిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు. సంప్రదాయ సాగు అయిన వరి,పత్తి తదితర వాటిని పండించి అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రభుత్వ మద్దతు ధర ఉన్నప్పటికీ దళారులు సాకులు చూపించి రైతుల పుట్టి ముంచుతున్నారు. ఫలితంగా సాగుకైన ఖర్చులు మిగలడం లేదు. ఇందుకు భిన్నంగా ఏలూరు జిల్లా బీమడోలు మండలం, పొలసానిపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆకు కూరలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
విభిన్న సాగు.. వైవిధ్య పంటలు.. మార్కెట్ గిరాకీ తదితరాలను గమనిస్తూ.. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ.. తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు ఏలూరు జిల్లా, బీమడోలు మండలం, పొలసానిపల్లి గ్రామానికి చెందిన రైతులు. వీరంతా కౌలు రైతులే. ఎకర, రెండెకరాలను వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని ప్రణాళిక బద్ధంగా ఏడాది పొడవునా ఆకుకూరల దిగుబడి వచ్చే విధంగా సాగుచేస్తూ ఉంటారు. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల గ్రామాలలో అమ్ముతూ.. ప్రతి రోజు వెయ్యి రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు