Green Pepper And Garlic Solution : కూరగాయల పంటల్లో శనగపచ్చ పురుగు, లద్దె పురుగు నివారణకు పచ్చి మిర్చి వెల్లుల్లి ద్రావణం!

3 కిలోల పచ్చి మిరపకాయలను కాడలు తీసి, వాటిని మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి. అరకేజి వెల్లుల్లి పాయలను పొట్టుతీసి, వాటిని బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్‌లో ఒక రాత్రంతా నానబెట్టాలి. తరువాతి రోజు పచ్చిమిర్చి ద్రావణం, వెల్లుల్లి ద్రావణం, 100 గ్రాముల సబ్బు పొడి, మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి.

Green Pepper And Garlic Solution : కూరగాయల సాగులో చీడపీడల నివారణకు రసాయనిక ఎరువుల వినియోగం వల్ల వాటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తాయి. అదే క్రమంలో రైతులు చీడపీడలను నివారించాల్సి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. లేకుంటే ఆపురుగులు పంటను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తాయి. ఈ సందర్భంలో ప్రకృతి సేధ్యపద్దతిలో చీడపీడలను నివారించేందుకు ప్రయత్నించటం వల్ల కొంతమేర ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో శనగ పచ్చపురుగు, లద్దె పురుగు దాసరి పురుగు ఎర్రగొంగళి పురుగల తాకిడి అధికంగా ఉంటుంది.

ఈ పురుగుల నివారణకు పచ్చి మిర్చి, వెల్లుల్లితో తయారు చేసుకున్న కషాయం బాగా ఉపకరిస్తుంది. ఈ కషాయం కంది, శనగ, వేరుశనగ, ఆముదంతోపాటు వంగ, టమాట, మిరప మొదలగు కూరగాయల మీద వాడవచ్చు. కషాయాన్ని పిచికారి చేసిన సందర్భంలో పురుగులు స్వర్శ చర్య ద్వారా పక్షవాతానానికి లోనై చనిపోతాయి.

తయారు చేయు విధానము :

3 కిలోల పచ్చి మిరపకాయలను కాడలు తీసి, వాటిని మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి. అరకేజి వెల్లుల్లి పాయలను పొట్టుతీసి, వాటిని బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్‌లో ఒక రాత్రంతా నానబెట్టాలి. తరువాతి రోజు పచ్చిమిర్చి ద్రావణం, వెల్లుల్లి ద్రావణం, 100 గ్రాముల సబ్బు పొడి, మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి.

ఈ విధంగా తయారు చేసిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో ఒక ఎకరా పొలంలో సాయంత్రం పూట పిచికారి చేయాలి. ఈ ద్రావణం తయారు చేయునపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం. ఈ ద్రావణం పంటలపై పిచికారి చేయునపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి. పంట కాలములో 1-2 సార్లు మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి. తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు. అన్ని పురుగుల నివారణకు ఈ ద్రావణాన్ని వాడుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు