Groundnut Varieties : రబీకి అనువైన వేరుశనగ రకాలు.. సాగులో అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు

వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా  ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు . ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు, అధిక విస్తీర్ణంలో పాత రకాలనే సాగుచేస్తూ ఉంటారు.

Groundnut Varieties

Groundnut Varieties : నూనెగింజల పంటల్లో ప్రధానమైనపంట వేరుశనగ. ముఖ్యంగా రబీలో ఈ పంటను రాయలసీమ, ఉత్తరాంధ్ర , తెలంగాణ జిల్లాలో అధికంగా సాగుచేస్తుంటారు. అయితే వేరుశనగ సాగుచేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని , సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని చెబుతున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకట లక్ష్మి.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా  ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు . ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు, అధిక విస్తీర్ణంలో పాత రకాలనే సాగుచేస్తూ ఉంటారు. ముఖ్యంగా రబీలో వేసే వేరుశనగ పంటలో, అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు నేల తయారీ, విత్తనశుద్ధి కీలకమని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకట లక్ష్మి.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

రకాల ఎంపిక ఎంత ముఖ్యమో యాజమాన్యం కూడా అంతే ముఖ్యం . ముఖ్యంగా వేరుశనగలో ఎరువులు, నీటి యాజమాన్యం కీలకమైనది. సమయానుకూలంగా సిఫార్సుల మేరకు ఎరువులు అందించాలి. కీలక దశల్లో నీటి తడులను అందిస్తే నాణ్యమైన, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త  వెంకట లక్ష్మి.