Bamboo Cultivation : తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న వెదురు సాగు

ముఖ్యంగా వెదురు సాగుకు ఇంత డిమాండ్‌ ఎందుకు పెరిగిందంటే దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణకు బొగ్గుకు బదులుగా వెదురు గుళికలు తప్పని సరిగా వాడాలని కేంద్ర ఇందన కొత్త విధానంలో పేర్కొంది.

Bamboo Cultivation : తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న వెదురు సాగు

bamboo cultivation

Bamboo Cultivation : ఇటీవల కాలంలో రైతులు కలప పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో టేకు, శ్రీగంధం, మలబారు వేప, వెదురు వంటి పంటలను.. సాగుకు అనువుగా లేని భూముల్లో సాగుచేసేవారు. అయితే ఈ మధ్య కాలంలో వెదుకు భారీగా డిమాండ్ పెరగడం… ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందించడంతో రైతులు ఈ పంట సాగుకు ముందుకొస్తున్నారు. ఈకోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు 24 ఎకరాల్లో సాగుచేశారు. పంట ఆశాజనకంగా పెరగడం.. వెదురుకు స్థానికంగానే డిమాండ్ ఉండటంతో సాగుపట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : ATM Cultivation : ఏటీఎం సాగు.. 70 సెంట్లలో 26 రకాల పంటలు

ప్రపంచమంతా ప్లాస్టిక్ మయమైపోయింది. యూస్ అండ్ త్రో విధానంలో  గుట్టలు, గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. ఇంటి నిర్మాణం నుంచి క్యారీ బెగ్ ల వినియోగం వరకు అంతా ప్లాస్టిక్ మయం. ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. కానీ ఇప్పడే ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే, ప్రకృతి వనరులును నిర్లక్ష్యం చేయటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఒకప్పుడు పల్లెల్లోని కొండలు గుట్టల్లో వెదురు తోటలు పుష్కలంగా కనిపించేవి. వీటితో కోళ్ళ గంపలు, పూలబుట్టలు, కూరగాయ బుట్టలు, వెదురు పాకలు, చలవ పందిళ్ళు ఇలా అనేక రకాలుగా గ్రామాల్లోని జీవన విధానంలో వెదురు భాగంగా వుండేది.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

పట్టణాలలో వారి లైఫ్ స్టయిల్లో గృహ  అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు కొత్తగా బాంబూ పాడ్స్ రూఫింగ్, వాల్ డిజైన్స్, ఫ్లోరింగ్ అంటూ వినియోగం పెరిగింది. కమర్షియల్ గా మంచి డిమాండు కూడా ఉంది. కానీ సప్లై లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ డిమాండ్ మరింత పెరిగింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో వెదురును ప్రత్యేకంగా పెంచుతున్న రైతులు లేరు. దీనికితోడు మార్కెట్లో వెదురు ధరలు చుక్కులు చూపిస్తుండటంతో, వినియోగం తగ్గిపోయింది.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

ఈ నేపధ్యంలో వెదురు సాగును విస్తరించి, పర్యావరణహితమైన ఈ కలపను అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశ్యంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేశాయి. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు ప్రధాన పంటగా వెదురును సాగుచేస్తున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, ఓగిరాల గ్రామంలో 24 ఎకరాల్లో బీమా రకం వెదరును సాగుచేస్తున్నారు రైతు నాగిరెడ్డి .

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

ముఖ్యంగా వెదురు సాగుకు ఇంత డిమాండ్‌ ఎందుకు పెరిగిందంటే దేశ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రణకు బొగ్గుకు బదులుగా వెదురు గుళికలు తప్పని సరిగా వాడాలని కేంద్ర ఇందన కొత్త విధానంలో పేర్కొంది. వెదురు గుళికలు వాడాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారి చేసింది. థర్మల్ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు వినియోగం వల్ల ఏటా 21లక్షల టన్నులకుపైగా బొగ్గు వాయువు కార్బండయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతోంది. దీని వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని కేంద్ర విద్యుత్‌శాఖ ఓ నివేదికలో తెలిపింది. అందుకే బొగ్గును కాల్చే సమయంలో ఏడు శాతం వెదురు గుళికల్ని వాడాలని జాతీయ ఇంధన విధానంలో కేంద్రం స్పష్టం చేసింది. అందుకే వెదురు సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

వెదురు గుళికల డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకొని ఉద్యానవనశాఖ వెదురు సాగుతో బంగారం వ్యాపారంతో సమానమని సూచిస్తోంది. ఒకసారి నాటితే దీర్థకాలికంగా దిగుబడులను పొందవచ్చు. అందుకే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న భూమిలో వెదురు సాగు చేసుకుంటే బంగారం పండించినట్లే అవుతుంది.