Sameekrutha Vyavasayam : కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంచుతున్న ఏలూరు జిల్లా రైతు

మొత్తం నలుగురు పనివాళ్లతో సేంద్రీయపద్దతులను అనుసరిస్తూ సాగు చేపట్టారు. సంవత్సరానికి 15 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు. 2 ఎకరాల కొబ్బరి తోటలో నాటుకోళ్ళు, చేపల పెంపకం చేపట్టారు. 40 సెంట్లలో చేపల చెరువు, 10 సెంట్లలో కోళ్ల షెడ్లు నిర్మాణం చేశారు. 

Sameekrutha Vyavasayam : ఒకే పంటసాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ముఖ్యంగా  ఎకరం, రెండెకరాల భూమి మాత్రమే కలిగిన చిన్న, సన్నకారు రైతుకుటుంబాలు ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. వీటిని నుండి రైతు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. దీన్నే ఆచరిస్తూమంచి లాభాలు గడిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన కన్నాపురం గ్రామానికి చెందిన రైతు వీరగొల్ల వెంకటరమణ.

రైతు వెంకట రమణ డిగ్రి వరకు చదువుకున్నారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న రెండెకరాల పొలంలో కొబ్బరి మొక్కలు నాటారు. అయితే కొబ్బరి నుండి ఆదాయం పొందాలంటే మూడేళ్ల పాటు ఆగాల్సిందే. అప్పటి వరకు పెట్టుబడులు, ఇంటి ఖర్చుల కోసం సమీకృత వ్యవసాయం చేయాలనుకున్నారు. అందుకే కొబ్బరితోటలోనే కొద్ది విస్తీర్ణంలో చేపల చెరువును తీసి అందులో పలు రకాల చేపలను పెంచుతున్నారు. మరోపక్క మేలుజాతి నాటుకోళ్లను పెంచుతూ వాటి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

మొత్తం నలుగురు పనివాళ్లతో సేంద్రీయపద్దతులను అనుసరిస్తూ సాగు చేపట్టారు.  2 ఎకరాల కొబ్బరి తోటలో నాటుకోళ్ళు, చేపల పెంపకం చేపట్టారు. 40 సెంట్లలో చేపల చెరువు, 10 సెంట్లలో కోళ్ల షెడ్లు నిర్మాణం చేశారు.  కొబ్బరి మొక్కలపై ఏడాదికి 1 లక్ష రూపాయలు చేపలపై అదాయం 4లక్షలు అదాయం లభిస్తుండగా ఒక్క కోళ్ళ పెంపకం ద్వారానే 15లక్షల అదాయం పొందుతున్నారు. గిన్నికోళ్లు, పేరుజాతి కోళ్లు, ఆసిల్ కోళ్లు , భీమవరం జాతులు పెంచుతున్నారు. జీవామృతం ఉపయోగిస్తూ కొబ్బరితోట పండిస్తున్నారు. నవారా, బహురూపి ధాన్యాన్ని పండిస్తున్నారు.

వెంకటరమణ లాగానే రెక్కల కష్టాన్ని నమ్ముకునే చిన్న, సన్నకారు రైతు ఏడాది పొడవునా అనుదినం ఆదాయాన్ని అందించే విధంగా సమీకృత సేంద్రియ పద్ధతులను విజయవంతంగా ఆచరించి చూపిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు