Cotton intercropping : పత్తిలో అంతర పంటల సాగుతో అధిక లాభాలు

Cotton intercropping : వర్షాధారంగా పంటలు సాగుచేసే రైతులు ఒకే పంటపై ఆదారపడకుండా అంతర పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Cotton intercropping : వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్ధితులు ఎలా ముంచుకొస్తాయో ఉహించలేం.. ఏ తెగులు ఎప్పుడు, ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం.. ఎంతనష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం.. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం అంతర పంటల సాగు అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రధాన పంటలు సాగు చేస్తూనే.. అంతర పంటలు సాగుచేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా.. చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే రెండు పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. అంతరపంట సాగుతో పెట్టుబడి ఖర్చులూ తగ్గుతాయి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

భారత దేశంలో చాలావరకు వర్షాధారం పైనే వ్యవసాయం ఆధారపడి ఉంది.  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాధార మీద ఆధారపడి  65% పంటల సాగు జరుగుతుంది.  ఇటువంటి పరిస్థితులలో సమయానికి వర్షాలు పడక , బెట్ట పరిస్థితులు ఏర్పడితే..  పంట దిగుబడులపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా పంటలు సాగుచేసే రైతులు ఒకే పంటపై ఆదారపడకుండా అంతర పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.  అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ, తక్కువలను గమనించాలి.

నేల నుంచి నీరు తీసుకునే లోతులో వ్యత్యాసం ఉండే పంటను ఎంపిక చేసుకోవాలి. వేర్వేరు కాల పరిమితులు ఉన్న పంటలు, పప్పు జాతి పంటలను సాగు చేసుకుంటే పోషకాలు తీసుకోవడంలో పోటీ ఉండదు. మరి ఏ పంటలలో ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ఐ. తిరుపతి .

అంతర పంటలతో భూములకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రెండు పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ట్రెండింగ్ వార్తలు