High Yield New Rice Variety BPT-3082
Rice Variety BPT-3082 : తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన ఆహారపంట వరి. ఐదారేళ్లుగా శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చిన నూతన వరి వంగడాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. మినికిట్ దశలో ఉన్న కొన్ని వరి వంగడాలను రైతులు సాగుచేస్తున్నారు. ఈ కోవలోనే బి.పి.టి – 3082( ముప్పై ఎనబైరెండు) రకాన్ని కృష్ణా జిల్లా రైతు సాగుచేస్తున్నారు. మరి ఆ రకం గుణగణాలు.. రైతు అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం.
Read Also : Red Gram Cultivation : కందిపంటలో శనగపచ్చ పురుగుల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
పొడవైన కంకులతో ఆశాజనకంగా పెరిగిన ఈ నూతన వరి వంగడం బి.పి.టి -3082 ( ముప్పై ఎనబైరెండు) బాపట్ల పరిశోధనా స్థానం రూపొందించిన ఈ నూతన వరి రకం మూడెళ్లుగా చిరుసంచుల ప్రదర్శన కింద రైతులకు అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కవ ఎత్తు పెరిగి, సన్నగింజ సైజుతో రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను అందిస్తోంది.
సెమీ ఆర్గానిక్ పద్ధతిలో సాగు :
ఏటా నూతన రకాలను సాగుచేసే కృష్ణా జిల్లా, నూజివీడుకు చెందిన రైతు రమేష్ ఈ ఖరీఫ్ లో మిగితా రకాలతో పాటు బి.పి.టి -3082 ( ముప్పై ఎనబైరెండు) రకాన్ని సాగుచేశారు. ప్రస్తుతం కోత కోస్తున్నారు. చీడపీడలను తట్టుకొని మిగితా రకాలకు దీటుగా దిగుబడినిస్తోంది.
బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన బి.పి.టి -3082 ( ముప్పై ఎనబైరెండు) విడుదలకు ముందే రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తోంది . మూడవ మినికిట్ దశలో ఉన్న ఈ రకం ఎకరాకు 45 నుండి 50 బస్తాల దిగుబడిని ఇస్తోంది.
స్వల్పకాలిక రకమైన ఈ వంగడం సన్నరకం గింజ, అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది. వంగడం పొట్టి రకం. కాండం దృఢంగా ఉండటంతో వర్షాలు, గాలులకు త్వరగా పడిపోదు. మరిన్ని వివరాలు వ్యవసాయ శాఖ అధికారి ద్వారా తెలుసుకుందాం..
Read Also : Azolla Cultivation Methods : అజోల్లా పెంపకం.. సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు