High Yields from MTU 1318
High Yielding Rice Variety : ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లా రైతులకు మరో కొత్త వరి వంగడం అందుబాటులోకి వచ్చింది. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా మారుటేరు పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఎం.టి.యు – 1318 (పదమూడు పద్దెనిమిది ) రకం విడుదలకు ముందే రైతుల మన్నలను పొందుతోంది. 3వ మినికిట్ దశను పూర్తిచేసుకున్న ఈ రకం గుణగణాలేంటో ప్రధాన శాస్త్రవేత్త డా. శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం..
వాయిస్ ఓవర్ : ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో వరిసాగుచేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రైతులు. అధికంగా దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలను సాగుచేస్తుంటారు. ఉత్తర కోస్తా తోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో చాలా వరకు రైతులు సన్నగింజ రకమైన స్వర్ణను సాగుచేస్తూ ఉంటారు.
READ ALSO : Rice Varieties : ఖరీఫ్ కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు
అయితే ఈ రకం వర్షాలకు పడిపోతుండటంతో , ప్రత్యామ్నాయంగా పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయంగా ఎం.టి.యు 1318 ( పదమూడు పద్దెనిమిది) రకాన్ని రూపొందించారు.
READ ALSO : Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన వరంగల్ వరి రకాలు
మూడో మినికిట్ దశను పూర్తిచేసుకున్న ఈ రకం రైతు క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదుచేసింది. ప్రస్తుతం ఈ ఖరీఫ్ లో పేయిడ్ కిట్ దశలో రైతులకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంచారు. అయితే ఈ రకం గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు, ప్రధాన శాస్త్రవేత్త డా. డా. శ్రీనివాస్.