Eradicate Insects In Crops : సౌరవిద్యుత్ తో పంటపొలాల్లో క్రిమికీటకాలను నిర్మూలన ఎలాగంటే?

ప్రస్తుతం మార్కెట్లోకి నెడ్ క్యాప్ సోలార్ ఇన్ సెక్ట్ ట్రాప్ పరికరాన్ని తీసుకువచ్చింది. సోలార్ సిస్టమ్ తో ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ కాంతికి పంటపొలాల్లోని పురుగులను నిర్మూలించవచ్చు.

Eradicate Insects In Crops : సౌరవిద్యుత్ తో పంటపొలాల్లో క్రిమికీటకాలను నిర్మూలన ఎలాగంటే?

How to eradicate insects in crops with solar power?

Updated On : December 16, 2022 / 10:21 PM IST

Eradicate Insects In Crops : చీడపీడల నుండి పంటపొలాలను రక్షించుకోవటం రైతులకు కత్తిమీద సాముగా మారింది. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి పురుగు మందులను పిచికారీ చేసినా వాటి ప్రభావం పెద్దగా కనిపించటం లేదు. పంటపొలాలను ఎలాగైనా రక్షించుకోవాలన్న తపన రైతుల్లో కనిపిస్తున్నా కీటకాల నివారణ మాత్రం సాధ్యం కావటంలేదు. అదే సమయంలో అధిక మందుల వినియోగం వల్ల ఆ ప్రభావం పంట దిగుబడిపై పడుతుంది.

ప్రస్తుతం మార్కెట్లోకి నెడ్ క్యాప్ సోలార్ ఇన్ సెక్ట్ ట్రాప్ పరికరాన్ని తీసుకువచ్చింది. సోలార్ సిస్టమ్ తో ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ కాంతికి పంటపొలాల్లోని పురుగులను నిర్మూలించవచ్చు. కీటకాలను సమర్ధవంతంగా నాశనం చేయటంలో ఈ పరికరం బాగా ఉపకరిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించారు.

పరికరం పనితీరు విషయానికి వస్తే ;

సౌర విద్యుత్ తో ఎల్ ఈడీ లైటు రాత్రి వేళల్లో వెలుగుతుంది. పగలు సౌర విద్యుత్ ను బ్యాటరీలో నింపుకుని రాత్రి సమయంలో వెలుగులు ప్రసరింప చేస్తుంది. పరుగులు ఎల్ ఈడీ లైటు వద్దకు ఆకర్షించబడతాయి. ఆసమయంలో కాంతిని తట్టుకోలేక చనిపోతాయి.

లైటు క్రింది బాగంలో ఒక డబ్ ను , అయిల్ , సర్ఫ్ తో కూడిన ప్లేటును ఏర్పటు చేశారు. అన్ని రకాల పురుగులు దీనిలో పడి చనిపోతాయి. ఒక్కోలైటును రెండు ఎకరాల విస్తీర్ణంతో కూడిన పంటపొలంలో వినియోగించవచ్చు. ఒక చోటి నుండి మరో చోటికి సులభంగా తీసుకువెళ్ళే వెసులు బాటు కూడా ఉంది. ప్రస్తుతం దీని ధర 5,731గా నిర్ణయించారు. రైతులు ఈ సోలార్ సిస్టమ్ కావాల్సి వస్తే నెడ్ క్యాప్ అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది.