Rains: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు

హైదరాబాద్ సహా తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Rains: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు

Rain

Updated On : August 28, 2025 / 8:54 AM IST

Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఖమ్మం, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు.

మరోవైపు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. (Rains)

Also Read: Heavy Rains: రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. జాగ్రత్త.. పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో నేడు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ సత్యప్రసాద్.

కామారెడ్డి- హైదరాబాద్ పాత హై వే వద్ద రోడ్డు ధ్వంసమైంది. జీఅర్ కాలనీ వద్ద రహదారి కుంగింది. కామారెడ్డి జిల్లాలో వర్షాలు మళ్లీ కురుస్తున్నాయి. మాచారెడ్డి, పాల్వంచ ఏరియాల్లో వర్షం కురుస్తోంది.

సిరిసిల్ల, కామారెడ్డి మధ్య ఇంకా రాకపోకలు ప్రారంభం కాలేదు. పాల్వంచ బ్రిడ్జి వద్ద రహదారి కొట్టుకుపోయింది.