Butter vs Ghee: వెన్న vs నెయ్యి: దేనిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.. ఏది ఆరోగ్యానికి మంచిది?
భారతీయ వంటకాలలో వెన్న, నెయ్యి (Butter vs Ghee) రెండూ ఒక భాగంగా మారిపోయాయి. చాలా మంది వెన్న, నెయ్యి లేకుండా

Butter vs ghee: Which is better for health to eat?
Butter vs Ghee: భారతీయ వంటకాలలో వెన్న (Butter), నెయ్యి (Ghee) రెండూ ఒక భాగంగా మారిపోయాయి. చాలా మంది వెన్న, నెయ్యి లేకుండా ఆహరం తీసుకోరు. ఆహారానికి రుచిని అందించడమే కాదు.. ఆరోగ్యంలో కూడా చాలా మేలు చేస్తాయి. (Butter vs Ghee)కానీ, చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే? ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అని. అలాగే కోరారు ఎందులో ఎక్కువగా ఉంటుంది అని. మరి ఈ రెండు విషయాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: గుడ్లను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిదేనా.. పెడితే ఏమవుతుంది?
వెన్న (Butter) అంటే ఏమిటి?
వెన్న అనేది పాల నుండి తీసిన క్రీమ్‌ను చిలికి తయారు చేయబడే పదార్థం. ఇది సాధారణంగా పాలలో ఉన్న నీరు, ప్రోటీన్లు, కొవ్వు కలయికలతో ఏర్పడుతుంది. దీనిలో కాలరీలు, కొవ్వు, సాచ్యురేటెడ్ ఫ్యాట్, కల్చర్ లేదా ఉప్పు, విటమిన్లు: A, D, E, K ఉంటాయి.
నెయ్యి (Ghee) అంటే ఏమిటి?
నెయ్యి అనేది వెన్నను వేడి చేసి, అందులో నీరు, మిల్క్ సాలిడ్స్ తీసేసిన తర్వాత మిగిలే శుద్ధ కొవ్వు. ఇది ఆయుర్వేదంలో ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇందులో కాలరీలు, కొవ్వు, సాచ్యురేటెడ్ ఫ్యాట్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, A, D, E, K విటమిన్లు కూడా ఉంటాయి.
ఆరోగ్య పరంగా ఏది మంచిది?
నెయ్యి ఆరోగ్యానికి ఉత్తమ ఎంపిక:
ఇందులో ఎక్కువ కొవ్వు ఉంటుంది. కానీ, తేలికగా జీర్ణమయ్యే గుడ్ ఫ్యాట్స్‌ను అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి జీర్ణ శక్తిని పెంచుతుంది, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, పిత్త, కఫ దోషాలను సమతుల్యను తగ్గిస్తుంది.
వెన్న పరిమితంగా వాడాలి:
కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు వెన్నను తక్కువగా వాడటం మంచిది. పాలు పడనివారికి వెన్నలో ఉండే లాక్టోస్ వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు
కొవ్వు ఎక్కువగా ఎందులో ఉంటుంది?
- నెయ్యిలో కొవ్వు అధికంగా ఉంటుంది (99.8%)
- వెన్నలో కొవ్వు తక్కువగా ఉంటుంది (81%)
నెయ్యి ఎవరికీ మంచిది?
పిల్లలు: మెదడు అభివృద్ధి చెందుతుంది
గర్భిణీలు: శక్తి, బలాన్ని ఇస్తుంది
వృద్ధులు: తేలికగా జీర్ణమయ్యే కొవ్వు ఇస్తుంది
వ్యాయామం చేసే వారు: ఎనర్జీ రికవరీ కోసం.