Tomatoes in Staking System : నిలుపు పందిరి విధానంలో.. టమాట సాగు
స్టేకింగ్ విధానంలో సాగు చేస్తే, మొక్కలు ఒత్తిడికి గురికావు. ప్రతీ కొమ్మా, రెమ్మను పైకి పాకించటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, రైతుకు మంచి ఫలితాలనిస్తాయి. సాధారణంగా టమాట పంట 4 నెలల్లో పూర్తవుతుంది. కానీ స్టేకింగ్ చేయటం వల్ల పంటకాలం పెరగటంతోపాటు, దిగుబడినిచ్చే కాలం పెరుగుతుంది.

Tomatoes in Staking System
Tomatoes in Staking System : అత్యాధునిక సేద్యపు పద్ధతులు, శాస్త్రవేతలు సూచనలు.. ప్రస్తుత రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుతున్నాయి. నూతన సాగు విధానంపై పరిజ్ఞానం పెంచుకుని పంటలను పండిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు రైతులు. ఈ కోవలోనే మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు.. శాశ్వత పందిరిని ఏర్పాటు చేసి.. అందులో స్టేకింగ్ విధానంలో టమాటను పండిస్తున్నారు. సెమీఆర్గానిక్ పద్ధతిలో సాగుచేయడం వల్ల అధిక దిగుబడులను పొందుతున్నారు.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
ఎత్తైన బెడ్లపై నాలుగైదు అడుగుల ఎత్తుతో.. ఆరోగ్యంగా పెరిగి, విరగ కాసిన ఈ టమాట తోటను చూశారా.. పెరుగుదల ఎంత ఆశాజనకంగా వుందో.. ఈ తోట మంచిర్యాల జిల్లా, బెల్లం పల్లి మండలం, రంగాపేట గ్రామానికి చెందిన రైతు ముద్దసాని సత్యంది. రెండున్నర ఎకరాల్లో టమాటను స్టేకింగ్ పద్ధతిలో పాలీ మల్చింగ్ విధానంలో సాగుచేస్తున్నారు.
పంట వేసి 3 నెలలు అవుతుంది . 60 రోజులను కోతలు కోస్తున్నారు. ఇప్పటికే 3 కోతలు జరిగాయి. 1000 బాక్సుల దిగుబడి వచ్చింది. ఒక బాక్స్ 25 కిలులు ఉంటుంది. అంటే 25 టన్నుల వరకు దిగుబడి వచ్చిందన్నమాట. ఒక్కో బాక్స్ 120 నుండి 150 రూపాయల వరకు అమ్మారు. మరో ఎడెనిమిది కోతల వరకు వచ్చే అవకాశాలున్నాయి. మరో 120 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO : Green Tomato : రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెకు మేలు చేసే గ్రీన్ టొమాటో!
స్టేకింగ్ విధానంలో సాగు చేస్తే, మొక్కలు ఒత్తిడికి గురికావు. ప్రతీ కొమ్మా, రెమ్మను పైకి పాకించటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, రైతుకు మంచి ఫలితాలనిస్తాయి. సాధారణంగా టమాట పంట 4 నెలల్లో పూర్తవుతుంది. కానీ స్టేకింగ్ చేయటం వల్ల పంటకాలం పెరగటంతోపాటు, దిగుబడినిచ్చే కాలం పెరుగుతుంది.
నేలపైన టమాట కాయలు ఉండకుండా తీగల వెంట పైకి పోవడం వల్ల టమాట కాత పైనే ఉంటుంది. దీని వల్ల కాయలు పెద్ద సైజులో మంచి నాణ్యత కలిగి వుంటున్నాయి. సంప్రదాయ సాగు విధానం కంటే స్టేకింగ్ విధానంలో టమాట సాగు తమకు అన్ని విధాలా లాభదాయకంగా వుంటుందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే వేసవిలో వచ్చే చీడపీడలనుండి పంటను కాపాడుకునేందుకు రైతులకు సూచనలిస్తున్నారు.
READ ALSO : Green Tomato : రోగనిరోధక శక్తిని పెంచే పచ్చి టమోటా!..