Green Tomato : రోగనిరోధక శక్తిని పెంచే పచ్చి టమోటా!..
కళ్లకు గ్రీన్ టామాటో ఎంతో ఉపకరిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. బీటా కెరోటిన్‌తో కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు దృష్టి కూడా మెరుగవుతుంది.

Green Tomato1
Green Tomato : ఆకుపచ్చని టమోటాల్లో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. చాలా మంది ఎర్రటి టమోటాలను ఎక్కవగా ఇష్టపడుతుంటారు. కూరల్లో, పచ్చడిగా, ఫేస్ ప్యాక్ లుగా పండిపోయిన ఎర్రటి టమాటాలను వాడుతుంటారు. అయితే పచ్చిగా ఉండే గ్రీన్ టామాటాలను ఎవరు వంటకాల్లో వాడేందుకు ఇష్టపడరు. అయితే చాలా మందికి వీటిని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోవటమే దీనికి కారణం. వీటి ప్రయోజనం చాలా తక్కువ మందికి తెలుసు. పచ్చి టమాటోల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
గ్రీన్ టామోటోలో విటమిన్ సి , ఎ, కాల్షియం, పొటాషియం తోపాటు ఆరోగ్యానికి మేలు కలిగించేవి ఇందులో ఉన్నాయి. అయితే ఇందులోని రసం కొంచెం వగరుగా ఉండటం వల్ల చాలామంది వీటిని ఇష్టపడరు. అయితే రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ మధ్యకాలంలో పోషకాహార నిపుపుణులు సైతం గ్రీన్ టమాటాలను ఆహారంలో భాగం చేసుకోమని సూచిస్తున్నారు.
కళ్లకు గ్రీన్ టామాటో ఎంతో ఉపకరిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. బీటా కెరోటిన్‌తో కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు దృష్టి కూడా మెరుగవుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు గ్రీన్ టమోటా తింటే కంటి చూపు పెరుగుతుంది. గ్రీన్ టమోటాలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చిటమోటాలలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది.
ఇందులో ఉండే పోటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఆకుపచ్చని టమోటాలను తీసుకోవటం వల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు. చర్మంపై మొటిమలు, నల్లమచ్చల సమస్య నుంచి బయటపడటానికి అనేక మంది వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని వాటి వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అయితే వాటికి బదులుగా గ్రీన్ టొమాటోలు వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.