India IT sector: ఇండియాపై ట్రంప్ మరో దెబ్బ? ఐటీ సెక్టార్‌ని నాశనం చేసేస్తారా?
భారత్ నుంచి అమెరికాకు వస్తువుల కంటే ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు వెళ్తారు. ఇప్పుడు ఇలా చేస్తే..

Donald Trump
India IT sector: భారత్‌పై భారీగా టారిఫ్‌లు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఐటీ రంగం వైపు చూస్తున్నారు. ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్లు, అవుట్‌సోర్సింగ్ పనులపై కూడా టారిఫ్ వేయాలని యోచిస్తున్నారు.
ఇప్పటికే హెచ్-1బీ వీసా వ్యవస్థలో భారీ మార్పులు చేయాలని, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, తాత్కాలిక వీసా ఉన్నవారు పంపే డబ్బుపై పన్ను పెంచాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు.
ఇవన్నీ అమెరికాలోని భారత ఇంజనీర్లు, కోడర్లు, విద్యార్థులపై ప్రభావం చూపుతాయి. అసలు ఈ హ్యూమన్ సోర్సులే అమెరికాలో ఐటీ రంగానికి ప్రధాన బలం.
కన్జర్వేటివ్ కామెంటేటర్ జాక్ పోస్ట్‌లో ఏముంది?
ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్లు, అవుట్‌సోర్సింగ్ పనులపై టారిఫ్ వేస్తారన్న ప్రచారం కన్జర్వేటివ్ కామెంటేటర్ జాక్ పోసోబియెక్ ఎక్స్‌లో తాజాగా చేసిన ఓ పోస్ట్‌తో మొదలైంది. అన్ని అవుట్‌సోర్సింగ్‌లపై టారిఫ్ వేయాలని ఆయన పేర్కొన్నారు.
అమెరికాకు విదేశాలు రిమోట్ సర్వీసులు అందించాలంటే వాటిపై కూడా వస్తువులలాగే టారిఫ్‌లు చెల్లించాలని అన్నారు. ఆ తర్వాత వైట్ హౌస్ ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సీనియర్ కౌన్సెలర్ పీటర్ నవారో కూడా ఆ పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు. దీంతో అమెరికా అధికారులు కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read: సీబీఐ డైరెక్టర్‌కి అస్వస్థత.. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స..
ఐటీ సేవలపై ప్రభావం
- ఈ చర్యలు అమలైతే ప్రపంచ అవుట్‌సోర్సింగ్ రంగంలో పెద్ద మార్పులు వస్తాయి.
- రిమోట్ వర్కర్లపై సుంకాలు పెడితే అమెరికా కంపెనీలకు ఐటీ, బ్యాక్ ఆఫీస్ సేవల ఖర్చు పెరుగుతుంది.
- కంపెనీలు ఒప్పందాల్లో మార్పులు చేయవచ్చు, ధరలు పెంచవచ్చు లేదా పని చేసేవారిని అమెరికాకు రావాలని చెప్పవచ్చు.
- సరఫరా గొలుసు దెబ్బతింటుంది, ప్రాజెక్ట్‌లు ఆలస్యం అవుతాయి. భారతీయ ఐటీ కంపెనీల లాభాలు తగ్గుతాయి.
భారత ఐటీ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలం. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఉద్యోగాల్లోకి వస్తున్నారు. (India IT sector)
ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి కంపెనీలు హెచ్-1బీ వీసాలకు ఎక్కువ దరఖాస్తులు ఇస్తాయి. భారతదేశం నుంచి అమెరికాకు వస్తువుల కంటే ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు వెళ్తారు.
భారత ఐటీ కంపెనీలు.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సేవలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ వంటివి అందిస్తున్నాయి. సుంకాలు పెడితే ఉపాధి, భారతదేశ గ్లోబల్ ఆర్థిక స్థాయి దెబ్బతింటాయి.
వీసాలు, రెమిటెన్స్‌లపై నియంత్రణ
సేవలపై సుంకాలతో పాటు అమెరికా వీసా నియమాలు కఠినతరం చేస్తోంది. హెచ్-1బీ వీసాలు భారత ఐటీ రంగానికి ఎప్పటి నుంచో ప్రధాన బలం.
ఇవి నిపుణులను అమెరికాలో క్లయింట్‌లతో పనిచేయడానికి అనుమతిస్తాయి. ఇప్పుడు విద్యార్థులు, జర్నలిస్టులు, ఇతరులకు వీసా వ్యవధిని తగ్గించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
అమెరికా రెమిటెన్స్‌లపై పన్ను కూడా పెంచింది. భారతదేశం ప్రపంచంలో ఎక్కువ రెమిటెన్స్‌లు పొందే దేశం. పౌరసత్వం లేని వారు పంపే డబ్బుపై పన్ను పెంచితే భారతదేశానికి వచ్చే విదేశీ కరెన్సీ తగ్గుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం 2023-24లో భారతదేశానికి వచ్చిన రెమిటెన్స్‌లలో 27.7% అమెరికా నుంచే వచ్చాయి.