Manchu Manoj : తను చెన్నైలో పెద్ద రౌడీ.. ప్రభాస్ హీరోయిన్ పై మంచు మనోజ్ కామెంట్స్ వైరల్..
మంచు మనోజ్ సుందరకాండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్లో మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.(Manchu Manoj)

Manchu Manoj
Manchu Manoj : మంచు మనోజ్ ఇటీవలే భైరవం సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలు చేస్తూనే సినిమా ఈవెంట్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తాజాగా మంచు మనోజ్ సుందరకాండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్లో మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.(Manchu Manoj)
నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న సుందరకాండ సినిమాతో ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో శ్రీదేవి కీలక పాత్ర చేస్తుంది. ఇన్నేళ్లయినా శ్రీదేవి అదే అందంతో అలరిస్తుండటంతో ఇటీవల బాగా వైరల్ అయింది. శ్రీదేవి కూడా ఈవెంట్ కి హాజరైంది.
తాజాగా జరిగిన సుందరకాండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ మాట్లాడుతూ.. శ్రీదేవి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు కలిసి పెరిగాము. చెన్నైలో తను పెద్ద రౌడీ. చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ నన్ను చిన్నప్పటి నుంచి ఎవరైనా బెదిరిస్తారు అంటే తనే. చెన్నైలో నన్ను చాలా ర్యాగింగ్ చేసింది. నేను అప్పుడు ఇన్నోసెంట్ గా ఉండేవాడిని. శ్రీదేవి ఇప్పటికి అలాగే ఫెంటాస్టిక్ గా ఉంది అని అన్నాడు.
శ్రీదేవి ఒకప్పటి స్టార్ నటుడు విజయ్ కుమార్ కూతురు. గతంలో తెలుగు పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు మోహన్ బాబు కూడా అక్కడే ఉండేవాళ్ళు. విజయ్ కుమార్ ఇంటి దగ్గర్లో ఉండటంతో పిల్లలుగా ఉనప్పటినుంచే శ్రీదేవి, మనోజ్ మంచి ఫ్రెండ్స్. ఆ స్నేహంతోనే మనోజ్ ఇలా సరదాగా చిన్నప్పటి విషయాలు మాట్లాడాడు.
Also Read : Prabhas : ప్రభాస్ సినిమాకు మళ్ళీ ఇబ్బందులు..? సంక్రాంతికి కూడా డౌటేనా? షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?