Prabhas : ప్రభాస్ సినిమాకు మళ్ళీ ఇబ్బందులు..? సంక్రాంతికి కూడా డౌటేనా? షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?
హారర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది.(Prabhas)

Prabhas
Prabhas : ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో రాజాసాబ్ ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో ఈ సినిమా ఎప్పట్నుంచో తెరకెక్కుతుంది. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది.(Prabhas)
ఇటీవల టాలీవుడ్ సమ్మె వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. అయితే ఫిలిం ఫెడరేషన్.. యూనియన్స్ ని షూటింగ్ కి వెళ్ళొద్దని సడెన్ గా ఎలాంటి నోటీసులు లేకుండా సమ్మె చేసి అనేకమంది నిర్మాతలకు నష్టం కలిగించారని నిర్మాతలు వాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షూటింగ్స్ కి రాకుండా తనకు నష్టం కలిగేలా చేశారని పలు యూనియన్స్ కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు. దీన్ని యూనియన్స్ వ్యతిరేకించారు.
Also Read : Dhee Pandu : త్రివిక్రమ్ సర్ వైఫ్ కి నా సాంగ్ చాలా ఇష్టం.. గుంటూరు కారం షూట్ లో ఆయన పిలిచి..
ఇంకేముంది.. సమ్మె పూర్తయినా షూటింగ్స్ మొదలయినా విశ్వప్రసాద్ సినిమా షూటింగ్ కి వెళ్ళమంటున్నారట. సమ్మె ఆపేస్తే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటాం అని నిర్మాత చెప్పారు. అయినా కొన్ని యూనియన్స్ మాత్రం విశ్వప్రసాద్ సినిమాల షూటింగ్స్ కి వెళ్లొద్దు అనుకుంటున్నారట.
ఈ క్రమంలో రాజాసాబ్ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఇలాంటి సమయంలో సినిమా వర్కర్స్ రాకపోతే షూటింగ్ కి కష్టమే. దీంతో రాజాసాబ్ మరింత ఆలస్యం అవ్వనుంది. అయితే ఒకవేళ ఇక్కడ హైదరాబాద్ వర్కర్స్ రాకపోతే చెన్నై నుంచి తెచ్చుకొని షూటింగ్స్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. నిర్మాత మీద కంటే కూడా ఫ్యాన్స్ నుంచి డైరెక్టర్ మీదే ఎక్కువ ఒత్తిడి ఉంది. దీంతో మారుతి ఎలాగైనా ఈ ఇయర్ ఎండ్ లోపు రాజాసాబ్ పూర్తిచేయాలని ట్రై చేస్తున్నారు.
Also Read : Samantha : సమంతకు నమ్మకం లేదా? కొత్త దర్శకుడిని కాదని తన ఫ్రెండ్ కి..
తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమాలో ఇంకా కొన్ని సీన్స్ తో పాటు మూడు సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. కేరళలో ఒక షెడ్యూల్, విదేశాల్లో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా ప్లాన్ చేసారు. మరి రాజాసాబ్ షూటింగ్ అనుకున్నట్టు జరుగుతుందా లేదా చూడాలి. ఇక ఈ సినిమాని పలుమార్లు వాయిదా వేసి డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామన్నారు. ఇది కూడా వాయిదా పడి సంక్రాంతి బరిలో దిగడానికి ప్లాన్స్ వేశారు. కానీ ఇప్పుడు షూటింగ్ ఇంకా అవ్వలేదు, VFX వర్క్స్ కూడా చాలానే ఉన్నాయి దీంతో సంక్రాంతి కూడా డౌటేనా అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.