Dhee Pandu : త్రివిక్రమ్ సర్ వైఫ్ కి నా సాంగ్ చాలా ఇష్టం.. గుంటూరు కారం షూట్ లో ఆయన పిలిచి..

పండు లేడీ గెటప్ తో 'నాది నక్కిలేసు గొలుసు..' అనే పాటకు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. ఆ సాంగ్ తో పండు స్టార్ అయిపోయాడు.(Dhee Pandu)

Dhee Pandu : త్రివిక్రమ్ సర్ వైఫ్ కి నా సాంగ్ చాలా ఇష్టం.. గుంటూరు కారం షూట్ లో ఆయన పిలిచి..

Dhee Pandu

Updated On : August 26, 2025 / 7:46 AM IST

Dhee Pandu : ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు ఇప్పుడు ఆర్టిస్ట్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, ఢీ షోలో డ్యాన్సర్ గా చేస్తూ బిజీగా ఉన్నాడు. పండు లేడీ గెటప్ తో ‘నాది నక్కిలేసు గొలుసు..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. యూట్యూబ్ లో ఆ సాంగ్ ఆల్మోస్ట్ 120 మిలియన్స్ కి పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఆ సాంగ్ తో పండు స్టార్ అయిపోయాడు.(Dhee Pandu)

తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పండు అనేక ఆసక్తికర విషయాలు తెలపగా ఆ సాంగ్ గురించి, ఆ సాంగ్ తనకు తెచ్చిపెట్టిన ప్రశంసలు, ఫేమ్ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ కూడా ఆ సాంగ్ గురించి మాట్లాడారని తెలిపాడు.

Also Read : Samantha : సమంతకు నమ్మకం లేదా? కొత్త దర్శకుడిని కాదని తన ఫ్రెండ్ కి..

పండు మాట్లాడుతూ.. నాది నక్కిలేసు గొలుసు సాంగ్ తర్వాత చాలా మంది సినిమా వాళ్ళు కూడా అభినందించారు. గుంటూరు కారం షూటింగ్లో త్రివిక్రమ్ సర్ పిలిచి.. నీ సాంగ్ మా వైఫ్ కి చాలా ఇష్టం. ఆమె ఢీ ఫాలో అవుతుంది. ఆమె చూసి నన్ను కూడా చూడమని నువ్వు చేసిన సాంగ్ పంపించింది. నేను చూసాను చాలా బాగుంది. ఆ సాంగ్ ఎలా చేయాలో అలా చేసావు. ఆ పాటలో కొన్ని అభ్యంతకర పదాలు ఉన్నా వాటిని నువ్వు కరెక్ట్ పద్దతిలో వెళ్ళేలాగా కామిక్ గా చూపించావు. నాకు అది బాగా నచ్చింది అని అన్నారు. అంత పెద్ద డైరెక్టర్ అలా చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆయన్ని లెజెండ్ లా చూస్తాను అని తెలిపాడు.

Also See : Sridevi Vijaykumar : ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోయిన్.. చీరలో ఎంత అందంగా ఉందో..