Oil Palm Farming : ఆయిల్ పాం సాగుతో అధిక లాభాలు

Oil Palm Farming : ఆయిల్ పాం ప్రపంచంలో కెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో ఏ ఏటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

Huge Profits With Oil Palm Farming

Oil Palm Farming : మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటవేస్తేనే రైతులకు లాభం. ప్రస్తుతం అలాంటి పంటల్లో ఒకటి ఆయిల్ పాం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా ఆయిల్ పాం సాగును ప్రోత్సహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ జిల్లాలో వీటి సాగు విస్తీర్ణం ఏఏటికాయేడు పెరుగుతోంది. మొక్కల మధ్య అంతరపంటలు కూడా సాగు చేసుకోవడం వల్ల అదనపు ఆదాయం చేకూరనుంది. అందుకే రైతులు వీటిసాగుకు మొగ్గుచూపుతున్నారు.

ఆయిల్ పాం ప్రపంచంలో కెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో ఏ ఏటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో..  రైతులు ఈ పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు.

ఇప్పటికే తెలంగాణలో వేసిన ప్రాంతాలలో కొన్నిచోట్ల దిగుబడులు కూడా ప్రారంభమయ్యాయి. మరికొంత మంది దిగుబడులను పొందేందుకు సిద్దమవుతున్నారు. అయితే మొక్కనాటిన 4 ఏళ్ళ వరకు దిగుబడులు రావు కాబట్టి.. అంతర పంటలతో ఆదాయం పొందుతున్నారు రైతులు.

Read Also : Coconut Cultivation : కొబ్బరి తోటల్లో చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం..